SIMHA RASI UGADI RASI PHALALU 2023-24 ఉగాది తర్వాత సింహ రాశి వ్యక్తులు అన్ని రంగాల్లోనూ సక్సెస్ సాధిస్తారు...!

Simha Rasi Ugadi Rasi Phalalu 2023-24 తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఛైత్ర శుద్ధ పాడ్యమి తిథి.. ఉగాది రోజున తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో సింహ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయో చూడండి...

Simha Rasi Ugadi Rasi Phalalu 2023-24 తెలుగు పంచాంగం ప్రకారం, ఈ ఏడాది మార్చి 21వ తేదీన మంగళవారం నాడు ‘శుభకృత’ నామ సంవత్సరానికి వీడ్కోలు పలకబోతున్నాం. అదే సమయంలో శ్రీ ‘శోభకృత్’ నామ సంవత్సరంలోకి మార్చి 22వ తేదీ బుధవారం రోజున అడుగు పెట్టబోతున్నాం. ఉగాది నుంచి ప్రారంభమయ్యే తెలుగు వారి నూతన సంవత్సరం 8 ఏప్రిల్ 2024న ముగుస్తుంది. తెలుగు వారి 60 సంవత్సరాల్లో ఇది 37వది. ఈ సమయంలో తెలుగు ప్రజలందరూ తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది.. తమ రాశి ఫలాలు ఎలా ఉంటాయి.. కనీసం కొత్త ఏడాదిలోనైనా కలిసొస్తుందా లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ సందర్భంగా ఉగాది తర్వాత సింహ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి.. ఆర్థిక పరంగా, ఆదాయ పరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పులు జరగనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

​సింహ రాశిపై గ్రహాల ప్రభావం..​

ఈ ఏడాదిలో సింహ రాశి నుంచి గురుడు అష్టమ స్థానం నుంచి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో వారసత్వాలు లేదా ఇతర భాగస్వామ్య వనరుల మెరుగుదల, విస్తరణకు అవకాశాలొస్తాయి. శని దేవుడు మార్చి 2025 వరకు పదో స్థానం నుంచి సంచరించనున్నాడు. ఈ కాలంలో మీ నాయకత్వ సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాహువు, కేతువులు వరుసగా 2, 8 పాదాల గుండా సంచారం చేయనున్నారు. ఈ సమయంలో ఆర్థిక పరమైన సవాళ్లు ఎదురవుతాయి.

Karkataka Rasi Ugadi Rasi Phalalu 2023-24 కొత్త ఏడాదిలో కర్కాటక రాశి వారికి కెరీర్లో కొత్త అవకాశాలొస్తాయి... ఆదాయంలోనూ పురోగతి లభిస్తుంది..!

ఆదాయం-14, వ్యయం-02

సింహ రాశి వారు ఉగాది తర్వాత ఆర్థిక పరమైన విషయాల్లో అద్భుతమైన ప్రయోజనాలను పొందనున్నారు. అయితే మీకు ఖర్చులు కూడా పెరగొచ్చు. పొదుపు విషయంలో వివేకంతో వ్యవహరించాలి. ఆస్తి లేదా షేర్ల వంటి దీర్ఘకాలిక ఆస్తులలో పెట్టుబడి పెట్టడం వంటి కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించొచ్చు. ఆర్థిక నిపుణుల సలహాలు, మార్గదర్శకత్వం ద్వారా మంచి ప్రయోజనాలు పొందొచ్చు. ఈ కాలంలో మీరు ఎలాంటి సవాళ్లనైనా ఆర్థిక వనరులతో సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు.

కుటుంబ జీవితంలో..

కొత్త ఏడాదిలో రాజపూజ్యం-01, అవమానం-07గా ఉంటుంది. ఈ ఏడాదిలో మీ కుటుంబ జీవితంలో మెరుగైన వాతావరణం ఉంటుంది. ఈ రాశి నుంచి శని గ్రహం దశమ స్థానం నుంచి రవాణా చేయడం వల్ల మీ కుటుంబంతో సమయాన్ని గడపడానికి మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేయొచ్చు. ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించాలి. మీ కుటుంబ సభ్యులతో ఏవైనా సవాళ్లు తలెత్తితే పరిష్కరించుకోడానికి బహిరంగ సంభాషణ చేయాలి.

విద్యా రంగంలో..

ఈ రాశి వారిలో విద్యార్థులు ఉగాది తర్వాత మంచి విజయాలను సాధిస్తారు. మీరు ఎంచుకున్న రంగాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశాలను పొందొచ్చు. అంతేకాదు ఈ కాలంలో మీరు కొత్త విషయాలను లేదా అధ్యయన రంగాలను అన్వేషించడానికి ఆసక్తి కలిగి ఉండొచ్చు. ఈ కాలంలో సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏకాగ్రతతో లక్ష్యాలను సాధిస్తారు.

Mithuna Rasi Ugadi Rasi Phalalu 2023-24 ఉగాది తర్వాత అవివాహితులకు వివాహ యోగం.. మిగిలిన రంగాల్లో ఎలాంటి ఫలితాలొస్తాయంటే...!

కెరీర్ పరంగా..

సింహ రాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరీర్ పరంగా సానుకూల ఫలితాలొస్తాయి. ఈ కాలంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీకు లీడర్‌షిప్ పొజిషన్ రావొచ్చు. కెరీర్లో మీరు మంచి మెరుగైన ఫలితాలను పొందుతారు. కొత్త మార్గాలను అన్వేషించడానికి కొత్త అవకాశాలను పొందుతారు. మీకు ఆఫీసులో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీరు వినోదం, రాజకీయ రంగాలపై ఆకర్షితులవుతారు.

ఆరోగ్య పరంగా..

ఈ రాశి వారు ఉగాది తర్వాత ఆరోగ్య పరంగా బలంగా ఉంటారు. మీరు చాలా శక్తివంతంగా, చురుగ్గా ఉంటారు. అయితే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం, శారీరక శ్రమ చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు. మీరు తలనొప్పి, నిద్రలేమి, ఆందోళన ఒత్తిడి సంబంధిత ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం కేటాయించాలి. మీరు పోషకాహారాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. లేదంటే ఎసిడిటి, అల్సర్ వంటి జీర్ణ సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది.

వివాహ జీవితంలో..

సింహ రాశి వారి వివాహితులు ఈ ఏడాదిలో భవిష్యత్తుకు సంబంధించి సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో మీ భాగస్వామితో చాలా రొమాంటిక్ గా గడుపుతారు. ఈ రాశి వారు అహం, అహంకార ధోరణులను గుర్తుంచుకోవాలి. ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్, సంఘర్షణ పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. మీ భాగస్వామితో కొన్ని విషయాల్లో రాజీ పడి పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.

పాటించాల్సిన పరిహారాలు..

* సింహ రాశి వారు ఈ ఏడాదిలో సూర్య భగవానుడిని పూజించాలి. సూర్యోదయానికి ముందే లేచి ఆదిత్య స్తోత్రం పఠించాలి.

* ఈ కాలంలో అవసరమైన విద్యార్థులకు సహాయం చేయాలి. వారి కోసం పుస్తకాలు లేదా ఇతర అధ్యయన సంబంధిత సామాగ్రిని కొనుగోలు చేయాలి.

* మీరు వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి.

గమనిక

: ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.

Read

Latest Astrology News

and

Telugu News

2023-03-18T07:00:17Z dg43tfdfdgfd