SRISAILAM | భ్రమరాంబా దేవి అమ్మవారికి సారె సమర్పణ..!

Srisailam | ఆషాఢమాసం సందర్భంగా జూలై తొమ్మిదో తేదీ (మంగ‌ళ‌వారం) శ్రీశైలంలో శ్రీ భ్ర‌మ‌రాంబాదేవి అమ్మ‌వారికి శ్రీ‌కృష్ణ ద‌త్త‌సాయి సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో భ‌క్తులు సారె స‌మ‌ర్పించారు. శ్రీకృష్ణ దత్తసాయి సేవాసమితి అధ్యక్షురాలు శ్రీమతి సాహితీరెడ్డి ఆధ్వర్యంలో ఆ సమితి సభ్యులు,శివసేవకులు మొత్తం 200 మంది భక్తులు శ్రీ భ్రమరాంబా దేవివారికి సారె సమర్పించారు.

అమ్మ‌వారికి పసుపు, కుంకుమ, పలు రకాల పూలు, పండ్లతో సారెను సమర్పించారు. శ్రీమల్లికార్జునస్వామి వారికి, బయలు వీరభ‌ద్రస్వామి వారికి, సాక్షి గణపతి స్వామి వారికి, పలు ఉపాలయాల దేవతామూర్తులకు వస్త్రాలను కూడా సమర్పించారు.

2024-07-09T16:19:25Z dg43tfdfdgfd