SURYA BUDH YUTI 2023: మార్చి 31 వరకు ఈ మూడు రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. ఇందులో మీరున్నారా?

Budhaditya RajYog benefits: గ్రహాలు తమ గమనాన్ని ఎప్పటికప్పుడు మార్చడం ద్వారా అనేక రకాల శుభ రాజయోగాలు ఏర్పరుస్తాయి. అలాంటి ఓ శుభయోగం మార్చి 16 నుండి 31 మధ్య కొన్ని రాశులవారి జాతకంలో ఏర్పడబోతుంది. అదే సూర్యుడు మరియు బుధుడు కలయిక వల్ల ఏర్పడిన బుధాదిత్య యోగం. ఈ యోగాన్ని ఆస్ట్రాలజీలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ శుభయోగం వల్ల ప్రయోజనం పొందే రాశులేంటో తెలుసుకుందాం. 

బుధాదిత్య యోగం ఈ రాశులకు వరం

వృషభం (Taurus): ఈ రాశి వారి జాతకంలో పదకొండవ ఇంట్లో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. దీంతో వీరు ఏ పనిచేపట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. స్థిర చరాస్తులు పెరుగుతాయి. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది. 

కర్కాటకం (Cancer): ఈ రాశి యెుక్క  జాతకంలోని తొమ్మిదవ ఇంట్లో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. మీనరాశిలో బుధుడు-సూర్యుడు, బృహస్పతి కలయిక వల్ల ఈ రాశి వారికి అదృష్టం పట్టబోతుంది. మీరు ఎలాంటి కష్టమైన పని అయినా చాలా సులువుగా చేస్తారు. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ లభిస్తుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. మీ ఆదాయంలో అద్భుతమైన పెరుగుదల ఉంటుంది. 

వృశ్చికం (Scorpio): ఈ రాజయోగం మీ రాశి యెుక్క 5వ ఇంట్లో ఏర్పడుతుంది. దీంతో మీరు శుభవార్త వింటారు. దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. ఆదాయం వచ్చే మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. ప్రభుత్వ రంగాలలో పని చేసే వారు మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. 

Also read: Shukra Budh Gochar: మేషరాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 3 రాశులకు పండగే పండుగ.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

2023-03-19T13:03:46Z dg43tfdfdgfd