SUSHANTH ANUMOLU | కీలక పాత్రలో సుశాంత్‌

స్టార్‌ హీరో చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘భోళా శంకర్‌’. మెహర్‌ రమేష్‌ దర్శకుడు. తమన్నా నాయికగా నటిస్తున్నది. కీర్తి సురేష్‌ చిరంజీవికి సోదరి పాత్రలో కనిపించనుంది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో సుశాంత్‌ నటిస్తున్నారు. సుశాంత్‌ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించారు. కథలో అతను లవర్‌ బాయ్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ‘అలవైకుంఠపురములో’ సినిమాలో నటించిన తర్వాత ప్రత్యేక పాత్రలకు సుశాంత్‌కు డిమాండ్‌ ఏర్పడింది.

ప్రస్తుతం ఈ యువహీరో రవితేజ ‘రావణాసుర’ చిత్రంలోనూ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్‌ చిత్రీకరణలో ఉన్న ‘భోళా శంకర్‌’ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. రఘుబాబు, రావు రమేష్‌, మురళీశర్మ్త తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : మహతి స్వరసాగర్‌.

2023-03-18T21:49:37Z dg43tfdfdgfd