TELANGANA: హైదరాబాద్ లో 'గ్యాంగ్' సినిమా తరహాలో ఘరానా మోసం

Hyderabad | Crime News: ప్రస్తుత రోజుల్లో మోసాలు పెరిగిపోయాయి. చదువుకొని వారితో పాటు చదువుకున్న వాళ్లు కూడా మోసాల బారిన పడుతున్నారు. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించి ఆ తరువాత నోరెళ్ల బెడుతున్నారు. ఎంత అవగాహన కల్పించినప్పటికీ కూడా మోసాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది.  అయితే ఇందులో ఎక్కువగా యువతే ఉండడం గమనార్హం. సైబర్ నేరాలతో పాటు మన కళ్ల ముందే మోసం జరిగినా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక తికమకపడుతున్నారు. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఘరానా చోరీ చోటు చేసుకుంది.

శనివారం అది పట్టపగలు ఐదుగురు వ్యక్తులు మోండా మార్కెట్ లోని బాలాజీ జ్యువెలరీకి వెళ్లారు. తాము ఐటీ అధికారులమని తనిఖీలు చేయాలని అందులో పని చేస్తున్న సిబ్బందిని బెదిరించారు. ఆ తరువాత తనిఖీలు చేసినట్లు చేసి ట్యాక్స్ చెల్లించలేదని 2 కిలోల బంగారాన్ని సీజ్ చేస్తున్నామని తెలిపారు. అయితే ఐటీ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే బంగారాన్ని తీసుకెళ్లారు. దీనితో ఆ షాపు యజమాని ఆ ప్రాంతంలో ఉన్న మిగతా బంగారం షాపులకు వెళ్లి విషయం చెప్పాడు. అయితే ఐటీ అధికారులు నోటీసులు ఇవ్వకుండా అలా బంగారం తీసుకెళ్లరని వారు చెప్పారు. దీనితో అనుమానం వచ్చిన బాలాజీ జ్యువెలరీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా ఐటీ అధికారులతో మాట్లాడిన పోలీసులు వారిని నకిలీ అధికారులుగా గుర్తించారు. అలాగే సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఐదుగురు వ్యక్తులు ఐటీ అధికారులమని వచ్చినట్లు..ఎవరికీ అనుమానం రాకుండా ఐటి అధికారుల వలే సోదాలు జరిపినట్లు గుర్తించారు. దీనితో బంగారం యజమానికి అనుమానం రాలేదని పోలీసులు తెలిపారు. అయితే బంగారంతో దుండగులు సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

2023-05-28T05:28:04Z dg43tfdfdgfd