Vedat Marathe Veer Daudle Saat | బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్’. కొల్హాపూర్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్‌లో ప్రమాదం చోటు చేసుకున్నది. వంద అడుగులు ఎత్తు నుంచి 19 సంవత్సరాల యువకుడు లోయలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. దాంతో తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. సినిమా షూటింగ్ శనివారం 8.30 గంటల నుంచి షూటింగ్ ప్రారంభమైంది. కొల్హాపూర్‌లోని పన్‌హల్‌గడ్‌లో సినిమా షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫొటోగ్రఫీ చేస్తున్న నగేశ్ ఖోబారే అనే యువకుడు నేరుగా వంద అడుగుల లోతైన లోయలో పడిపోయాడు. ఈ ఘటన సెట్‌లో కలకలం సృష్టించింది.
వెంటనే అతన్ని దగ్గరలో ఉన్న కొల్హాపూర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం అందుకున్న పన్హాలా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. అయితే, ఇప్పటి వరకు పోలీసులు గానీ, చిత్రబృందం సైతం ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ‘మరాఠా’ చిత్రమైన ‘వేదాత్ మరాఠే వీర్ దౌడు సాత్’ చిత్రానికి మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ షూటింగ్ గత కొన్ని రోజులుగా కొల్హాపూర్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటిస్తుండగా.. జై దుధానే, ఉత్కర్ష్ షిండే, విశాల్ నికమ్, విరాట్ మడ్కే, హార్దిక్ జోషి, సత్య, అక్షయ్, నవాబ్ ఖాన్, ప్రవీణ్ తర్దే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
2023-03-19T12:05:01Z dg43tfdfdgfd