న్యూఢిల్లీ: సాధారణంగా పెళ్లి వేడుకల్లో ప్రతీ పని సవ్యంగా జరిగేందుకు నానా తంటాలు పడుతుంటారు. అలాగే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు చాలా హైరానా పడుతుంటారు. అయినప్పటికీ కొన్ని అనూహ్య సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పెళ్లిళ్లలో ఊహించనవి కూడా జరుగుతుంటాయి. అలాంటి ఒక సంఘటన ఇటీవల ఒక వివాహ వేడుకలో జరిగింది. వరమాల (Varamala) సమయంలో అనూహ్య సంఘటన జరిగింది. తొలుత వధువు, వరుడి మెడలో దండ వేస్తుంది. అనంతరం వరుడు ముందుకు వచ్చి వధువు మెడలో దండ వేస్తాడు. ఈ సందర్భంగా వరుడు ధరించిన పైజామా కిందకు జారుతుంది. దీనిని గమనించిన వధువు ముసిముసిగా నవ్వుతుంది.
కాగా, పెళ్లికుమార్తె నవ్వడం చూసిన పెళ్లికుమారుడు తన పైజామా జారినట్లు గ్రహిస్తాడు. అనంతరం దానిని పైకి లాక్కుంటాడు. పెళ్లి వేదిక నుంచి పక్కకు వెళ్లి పైజామాను సరి చేసుకుంటాడు. ఇది చూసి ఆ వధువు పగలబడి నవ్వుతూనే ఉంటుంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందించారు. వరమాల సందర్భంగా వరుడి పైజామా జారడంపై పలు కామెంట్లు చేశారు.
Also Read: