ఆల్​ఇన్​ మదన్​

ఆల్​ఇన్​ మదన్​

చరిత్ర, సైన్స్, పాలిటిక్స్​, ఫిలాసఫీ, కరెంట్​ అఫైర్స్​... ఒక్కటేమిటి అన్ని టాపిక్​లకు కేరాఫ్​ మదన్​ గౌరి యూట్యూబ్​ ఛానెల్​. వాస్తవానికి ఈ తరంవాళ్లకు ఇలాంటి సబ్జెక్ట్స్​ పెద్దగా నచ్చవు. కానీ.. మదన్​ చెప్పే స్టైల్​ నచ్చి చాలామంది ఈ వీడియోలు చూస్తున్నారు. అందుకే మదన్​ తమిళనాడులో సెలబ్రిటీ అయిపోయాడు. ప్రాంతీయ భాషలో వీడియోలు చేసినా ఇంతలా సక్సెస్​ రావడానికి కారణం అతను పెట్టిన ఎఫర్ట్​. 

మదన్ గౌరి మే 28, 1993లో తమిళనాడులోని తూత్తుకుడిలో పుట్టాడు. మాతృభాష తమిళం. వీడియోలు కూడా అదే భాషలో చేస్తున్నాడు. స్కూల్​ ఎడ్యుకేషన్​ను అమరావతినగర్‌‌లోని సైనిక్ స్కూల్, మధురైలోని డాల్ఫిన్ పబ్లిక్ స్కూల్‌‌లో పూర్తి చేశాడు. తర్వాత డిగ్రీ చేయడానికి శ్రీవిల్లిపుత్తూరులోని కలశలింగం అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌‌లో చేరాడు.  కోయంబత్తూరులోని అమృత విశ్వ విద్యాపీఠంలో ఎంబీఏ చదివాడు. మేనేజ్‌‌మెంట్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ డిగ్రీ కోసం స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్‌‌కు వెళ్లాడు. తర్వాత  కాగ్నిజెంట్, బాష్ ఇంజినీరింగ్‌‌తోపాటు కొన్ని కంపెనీల్లో పనిచేశాడు.

బ్రేకప్​ నుంచి యూట్యూబ్​ 

మదన్​ చదువుకుంటున్నప్పుడు లాస్ట్​ ఇయర్​లో ఒక అమ్మాయిని ప్రేమించాడు. తర్వాత ఆమెతో విడిపోవాల్సి వచ్చింది. దాంతో డిప్రెషన్‌‌కు గురయ్యాడు. ఆ డిప్రెషన్​ నుంచి బయటపడేందుకు  యూట్యూబ్ వీడియోలు చూడటం మొదలుపెట్టాడు. తర్వాత యూట్యూబ్ ఛానెల్​ పెట్టాడు. కాన్సంట్రేషన్​ మొత్తం ఛానెల్​ మీద పెట్టడంతో కొన్ని రోజులకు డిప్రెషన్ నుంచి​ బయటపడ్డాడు.  

కెరీర్

తనను తాను ఓదార్చుకోవడానికి 2013లో యూట్యూబ్​ ఛానెల్ పెట్టాడు మదన్​. మొదటి వీడియోను డిసెంబర్ 5, 2013న పోస్ట్ చేశాడు. కానీ.. వ్యూస్​ పెద్దగా వచ్చేవి కావు. కానీ.. కొన్ని రోజులకు ఛానెల్​కు వ్యూస్​ రావడం మొదలైంది. మదన్ వీడియోల్లో కంటెంట్​ సూటిగా, స్పష్టంగా ఉంటుంది. ఎంచుకున్న అంశాన్ని క్లుప్తంగా వివరిస్తాడు. అందుకే ఎక్కువమంది ఇష్టపడ్డారు. తక్కువ టైంలో సబ్​స్క్రయిబర్స్​ సంఖ్య పెరిగింది.  అయితే.. ఎక్కువ రీచ్  ఉంటుందనే ఉద్దేశంతో మొదట్లో ఇంగ్లిష్​లో వీడియోలు చేశాడు. కానీ.. తమిళంలో చాలా తక్కువ మంది క్రియేటర్లు ఇలాంటి వీడియోలు అప్​లోడ్​ చేస్తున్నారని తెలిసి మాతృభాషలోనే వీడియోలు చేశాడు. 

యూట్యూబ్‌‌లో రెగ్యులర్​గా వీడియోలు చేయడానికి ముందు ఒక ఐటీ కంపెనీలో అనలిస్ట్‌‌గా పనిచేశాడు. యూట్యూబ్​ కోసం జాబ్​ మానేసినప్పుడు అందరూ అతని అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. కానీ, సక్సెస్​ సాధించాడు. యూట్యూబ్ వీడియోలు చేయడంతో పాటు, ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్‌‌ను ఇంటర్వ్యూ చేసి టెడ్ఎక్స్ టాక్ కూడా ఇచ్చాడు. 2019లో అతను తమిళ భాషలో అత్యధికంగా సంపాదించిన యూట్యూబ్​ క్రియేటర్​గా రికార్డ్​ క్రియేట్​ చేశాడు. ఈ మధ్యే న్యూస్ యాప్ కోక్రును మొదలుపెట్టాడు. ఇది మొదటి 48 గంటల్లో 2,00,000 డౌన్‌‌లోడ్‌‌లను దాటింది.

రీసెర్చ్​ 

మొదట్లో సెల్​ఫోన్​లో వీడియోలు తీసేవాడు. ఇప్పటికీ వీడియోల్లో పెద్దగా ఎఫెక్ట్స్​ ఉండవు. నేరుగా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడి, వెళ్లిపోతాడు. అతని వీడియోలు చూస్తే ఒక ఫ్రెండ్​తో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. వీడియోలకు పెద్దగా ఎడిటింగ్​ కూడా అవసరం లేదు. అందుకే మొదటి నుంచి తన వీడియోలను తానే ఎడిట్​ చేసుకున్నాడు. మదన్​ వీడియోలకు అన్ని వయసుల వాళ్లు కనెక్ట్ అవుతారు. న్యూస్​లో ఉన్న అంశాల మీదే ఎక్కువగా వీడియోలు​ చేస్తుంటాడు. టాపిక్​ గురించి మాట్లాడే ముందు అతను చాలా రీసెర్చ్ చేస్తాడు. వీడియో కూడా మరీ పెద్దగా కాకుండా 15 నుండి 20 నిమిషాల నిడివితో అప్​లోడ్​ చేస్తాడు. 

మొదటి యూట్యూబర్​ 

యూట్యూబ్​లో మిలియన్ సబ్‌‌స్క్రయిబర్​ మార్క్​ను దాటిని మొదటి వ్యక్తిగత తమిళ యూట్యూబర్ మదన్ గౌరి. అంతేకాదు.. ప్రస్తుతం ‘మదన్​ గౌరి’ ఛానెల్​ను 6.72 మిలియన్ల మంది సబ్​స్క్రయిబ్​ చేసుకున్నారు. తమిళ భాష, సంస్కృతిపై వీడియోల సిరీస్ చేసినప్పుడు ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఇన్​స్టాగ్రామ్, ట్విట్టర్​ లాంటి సోషల్​ మీడియా ఫ్లాట్​ఫామ్​లలో  కూడా యాక్టివ్​గా ఉంటాడు. తన ఫ్యాన్స్​తో ఇంటరాక్ట్ అవుతుంటాడు. 

  ©️ VIL Media Pvt Ltd.

2023-05-28T05:44:50Z dg43tfdfdgfd