ఇంగ్లాండ్ కుర్రాడితో సమంత ప్రేమాయణం, కొత్తదనం కోసం అన్వేషణ

శాకుంతలం డిజాస్టర్ ప్రభావం  సమంత కెరీర్ పై ఏ మాత్రం పడలేదు. ఆమె  క్రేజ్ రోజు రోజుకీ  రెట్టింపు అవుతోంది. కేవలం తమిళ, తెలుగు లలో  టాప్ హీరోయిన్లలో ఒకరిగా  వెలిగిన సమంతకు  ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరిస్ తర్వాత ఇప్పుడు నార్త్ లో కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రాజెక్టు సైన్ చేసి మరో మెట్టు ఎక్కింది 36 ఏళ్ల సమంత. 

సమంత త్వరలో 'చెన్నై స్టోరీ' అనే ఆంగ్ల చిత్రంలో నటించబోతోంది. ఈ సినిమాలో ఇంగ్లాండ్ కు చెందిన వివేక్ కల్రా హీరోగా నటించనున్నాడు. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్నాడు. ఇంగ్లాండ్ కు చెందిన యువకుడికి, చెన్నైకు చెందిన యువతికి మధ్య జరిగే ప్రేమ కథగా ఈ చిత్రం ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.  ఇప్పటికే  సమంత (Samantha) ప్రస్తుతం ‘సిటడెల్‌’ (Citadel) వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా రానున్న ఈ సిరీస్‌ కోసం సామ్‌ చాలా కసరత్తులే చేస్తోంది. 

అయితే ప్రియాంక (Priyanka),  రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించిన ఇదే హాలీవుడ్‌ సిరీస్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌లో ఎపిసోడ్‌ల వారీగా స్ట్రీమింగ్‌ అవుతోంది. దీంతో చాలా మంది ఇదే వెబ్‌సిరీస్‌ను సమంత తీయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ‘ఇప్పటికే ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్‌ తెలుగులోనూ విడుదలైంది. అందరూ చూశారు కదా.. మళ్లీ మీరు దాన్ని రీమేక్‌ చేయడం ఎందుకు?’ అని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన సామ్‌ ఇది రీమేక్‌ కాదని చెప్పింది. 

దీనికి మరో యూజర్‌ కామెంట్‌ చేస్తూ.. ‘సిటాడెల్‌’ అన్ని దేశ భాషల్లోనూ తెరకెక్కుతోంది. ఇండియన్‌ వెర్షన్‌లో సమంత, వరుణ్‌ ధావన్‌ నటిస్తున్నారు. ప్రాంతానికి తగినట్లుగా సిరీస్‌లో మార్పులు చేస్తున్నారు’ అని రాశారు. ఇక ఈ కామెంట్‌ను ఆమె లైక్‌ చేసింది. 

ఇక సమంత ‘ఖుషి’తో (Khushi) మరోసారి సినీప్రియులను పలకరించనుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సామ్‌తో పాటు విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్‌ పూర్తయింది. మిగతా భాగాన్ని శరవేగంగా పూర్తిచేస్తున్నారు.

2023-05-28T08:46:22Z dg43tfdfdgfd