ఎన్టీఆర్ జయంతి: అన్నగారితో ఈ హీరోలు నటించిన మూవీస్ భలే బాగుంటాయ్!

Senior NTR : తెలుగు సినిమాకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు ప్రేక్షకులకు అన్నగారిగా దగ్గరైన ఆయన.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా రాజకీయ పదవులనూ అలరింకరించారు. తన కెరీర్ లో భిన్న రకాల క్యారెక్టర్స్ పోషించి, నవరస నటసార్వభౌమగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆయన చేసిన పౌరణిక చిత్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నటన, హావ భావాలు, డైలాగ్స్.. ఇలా ఒక్కటేమిటి పాత్రకు తగ్గట్టు వేషాలు వేసి, కోట్లల్లో అభిమానుల్ని సంపాదించుకున్నారు. 

నందమూరి తారక రామారావు ఎన్నో అద్భుత చిత్రాలతో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అన్ని తరాల వారిని అలరించేలా కథలను ఎంచుకుని అభిమానుల్ని ఎంటర్టైన్ చేశారు. అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ చేసిన మల్టీ స్టారర్ చిత్రాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అప్పట్లో అగ్ర కథానాయకులు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు, శోభన్ బాబు, మోహన్ బాబు లాంటి వారితో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించి, మెప్పించారు. అంతేకాకుండా అంతేకాకుండా మరెందరో హీరోలతో కలిసి ఎన్టీఆర్ గొప్ప చిత్రాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవితోనూ కలిసి బిగ్ స్క్రీన్‌పై ప్రేక్షకులను అలరించారు.

తొలి మల్టీస్టారర్ బ్లాక్ బస్టర్‌ ఆయనతోనే..

రామారావు, నాగేశ్వర రావు కాంబినేషన్‌లో 14 సినిమాలు రూపొందాయి. 1950లో వచ్చిన ‘పల్లెటూరి పిల్ల’ చిత్రంతో వీరిద్దరు తొలిసారి ఒకే సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ‘సంసారం’, ‘రేచుక్క’, ‘పరివర్తన’ సినిమాలు చేసినప్పటికీ వీరిద్దరి కాంబోకు అనుకున్న స్థాయి గుర్తింపు రాలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన ‘మిస్సమ్మ’ సినిమాతో వీరిద్దరు తమ తొలి మల్టీస్టారర్ బ్లాక్ బస్టర్‌ను అందుకుని రికార్డు సృష్టించారు. అంతేకాకుండా ఈ సినిమాతో వీరిద్దరి కాంబినేషన్ కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు, డిమాండ్ ఏర్పడింది. దాంతో దర్శకనిర్మాతలు వీరిద్దరితో సినిమాలు తీసేందుకు అత్యంత ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే ‘తెనాలి రామకృష్ణ’, ‘చరణదాసి’, ‘మాయా బజార్’, ‘భూకైలాస్’, ‘గుండమ్మ కథ’, ‘శ్రీ కృష్ణార్జున యుద్దం’, ‘చాణక్య చంద్రగుప్త’, ‘రామ కృష్ణులు’, ‘సత్యం శివం’ సినిమాల్లో సైతం వీరిద్దరూ కలిసి పని చేశారు.

‘సీతరామ కళ్యాణం’తో శోభన్ బాబు కాంబోలో తొలిసారి..

నటభూషణ శోభన్ బాబుతోనూ ఎన్టీఆర్ కలిసి నటించారు. వీరిద్దరూ మొదటిసారిగా ‘సీతరామ కళ్యాణం’సినిమాలో నటించారు. ఆ తర్వాత భీష్మ, మహామంత్రి తిమ్మరుసు, ఇరుగు పొరుగు, లవకుశ, నర్తనశాల, దేశ ద్రోహులు, వీరాభిమన్యు, శ్రీ కృష్ణ పాండవీయం, పరమానందయ్య శిష్యుల కథ, శ్రీ కృష్ణావతారం, ఆడపడుచు, విచిత్ర కుటుంబం, నిండు హృదయాలు సినిమాలు చేశారు. 

సూపర్ స్టార్ కృష్ణతోనూ స్ర్కీన్ షేరింగ్..

సూపర్ స్టార్ కృష్ణ గారితో ఎన్టీఆర్.. స్త్రీ జన్మ, నిలువు దోపిడి, విచిత్ర కుటుంబం, దేవుడు చేసిన మనుషులు, వయ్యారి భామలు వగలమారి భర్తలు సినిమాల్లో నటించారు.

డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో..

డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో కలిసి ఎన్టీఆర్ సింహ బలుడు, రామ కృష్ణులు,  రాజపుత్ర రహస్యం, డ్రైవర్ రాముడు, సర్దార్ పాపారాయుడు, సరదా రాముడు, కొండవీటి సింహం, అగ్గి రవ్వ, సత్యం శివం, ప్రేమ సింహాసనం, సామ్రాట్ అశోక, మేజర్ చంద్రకాంత్ చిత్రాల్లో కలిసి నటించారు. 

మెగాస్టార్ చిరంజీవితో..

మెగాస్టార్ చిరంజీవితో ‘తిరుగులేని మనిషి’ సినిమాలో నటించారు. అంతేకాకుండా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా 1979లో వచ్చిన టైగర్ సినిమాలోనూ చిరంజీవి, రామారావుతో కలిసి నటించారు.

2023-05-28T05:10:58Z dg43tfdfdgfd