ఐఫాలో సత్తా చాటిన ఆలియా భట్ సినిమా.. ఏకంగా 3 అవార్డ్ లు సాధించిన గంగూబాయ్

రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది పైనే అవుతుంది గంగూబాయి కతియావాడి సినిమా.  ఇండియన్ బాక్సాఫీస్‌పై దాడి చేసి సంచలనం సృష్టించింది. లేడీ ఓరియెంటెడ్‌ సినిమా.. బాలీవుడ్ లో.. ఆ  రేంజ్‌ హడావిడి చేయడం  మునుపెన్నడూ జరుగలేదు. సంజయ్‌లీలా భన్సాలీ సినిమా అంటేనే స్పెషల్.. ఆయన  విజన్‌కు‌, ఆలియాభట్‌ నటనతోడై.. ఆడియన్స్ ఉర్రూతలూగారు. స్టార్ హీరోల మాదిరి వంద కోట్ల  కలెక్షన్స్ తో ..... హిందీ బెల్ట్‌పై ఆలియాభట్‌  సూపర సక్సెస్ సాధించింది. 

కలెక్షన్లు మాత్రమే కాదు..  అనేక అవార్డులు సైతం గంగూబాయికి దాసోహం అయ్యాయి. ఆమధ్య జరిగిన  68వ ఫిలింఫేర్‌ అవార్డుల కార్యక్రమంలో ఏకంగా పది అవార్డులను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది గంగూబాయ్. ఇక ఇఫ్పుడు ఐఫాలో  కూడా సత్తా చాటింది.  ఉంటే తాజాగా ఈ సినిమా ఐఫా అవార్డుల్లో మరోసారి సంచలనంగా మారింది. 

ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌-2023 వేడుక యూఏఈ రాజధాని అబుదాబి లో ఘనంగా ప్రారంభమైంది. కాగా ఈ అవార్డు ఫంక్షన్‌లో గంగూబాయి సినిమాకు మూడు అవార్డులు వరించాయి. బెస్ట్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో సంజయ్‌ లీలా భన్సాలీ, ఉత్కర్శిని వషిష్ఠ అవార్డును గెలుచుకున్నారు. ఇక బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌గా సుదీప్‌ ఛటర్జీ అవార్డు అందుకున్నాడు. ప్రకాష్‌ కపాడియా-ఉత్కర్శిని వషిష్ఠ బెస్ట్‌ డైలాగ్‌ విభాగంలో అవార్డు అందుకున్నారు. ఇలా మూడు విభాగాల్లో గంగూబాయి అవార్డులు కైవలం చేసుకుంది.

ఇక ప్రస్తుతం ఆలియా భట్ సినిమాలకు విరామం ప్రకటించింది. పాపకు జన్మనివ్వడంతో... తన కూతురుని చూసుకోవాలి అని.. దాదాపు రెండేళ్ళు సినిమాలకు విరామం ప్రకటించింది. సరిగ్గా ఇదే టైమ్ లో గాలా వేడుకలు, ఫిల్మ్ ఫేర్, ఇప్పుడు ఐఫా ఉత్సవాలు జరుగుతుండటంతో.. వాటికి మాత్రం అటెండ్ అవుతున్నారు ఆలియా. అంతే కాదు ఆమె గూచి బ్రాండ్ కు .. ఫస్ట్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు కూడా. 

2023-05-28T06:16:29Z dg43tfdfdgfd