ఢిల్లీ లిక్కర్ కేసు.. మాగుంట రాఘవరెడ్డికి మధ్యంతర బెయిల్

ఢిల్లీ లిక్కర్ కేసు.. మాగుంట రాఘవరెడ్డికి మధ్యంతర బెయిల్

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది  ఢిల్లీ హైకోర్టు.  లిక్కర్  కేసులో  మాగుంట రాఘవ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు.  ఫిబ్రవరి 10న మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది.  తన అమ్మమ్మ  అనారోగ్యంతో ఆస్పత్రిలో  ఉందని ఆరు వారాల పాటు బెయిల్ ఇవ్వాలని కోరగా..రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. 

అయితే  విచారణ సందర్బంగా రాఘవ బెయిల్  పిటిషన్ కు  వ్యతిరేకంగా వాదనలు వినిపించింది ఈడీ.  83 ఏళ్ల రాఘవ అమ్మమ్మ బాత్రూమ్ లో జారిపడి గాయపడ్డారని.. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని చెప్పింది. ఆమె బాగోగులు చూసుకునేందుకు చాలా మంది ఉన్నారన్న ఈడీ.. ఐసీయూలో ఉండగా రోగిని చూడడం కుదరదని వాదించింది.  మనీ లాండరింగ్ చట్టంలో సెక్ష్45 ప్రకారం ఇలాంటి కారణాలతో బెయిల్ మంజూరు చేయొద్దని సూచించింది. కేసులో నిందితులందరు  తమ బంధువులు బాత్రూంలో పడి గాయపడుతున్నారంటూ బెయిల్ పిటిషన్ దరఖాస్తు చేస్తున్నారని తెలిపింది. అయితే  ఈడీ వాదనలు పరిగణలోకి తీసుకోకుండా షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు.

 ఈ మధ్య ఢిల్లీ లిక్కర్ కేసులో శరత్ చంద్రారెడ్డి ఈడీకి అప్రూవర్  గామారారు. శరత్ చంద్రారెడ్డికి బెయిల్ ఇచ్చిన కోర్టు తాజాగా రాఘవరెడ్డికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది.

©️ VIL Media Pvt Ltd.

2023-06-07T08:18:38Z dg43tfdfdgfd