పరశురాం అప్పులకు దిల్ రాజు హామీ.. కోట్ల రూపాయలు తీర్చేందుకు సిద్ధం!

సూపర్‌స్టార్ మహేష్ బాబుతో సినిమా అనగానే డైరెక్టర్ పరశురాం (Parasuram) ఎగ్జైట్ అయిపోయాడు. మిగతా ప్రాజెక్టులు పక్కనపెట్టేసి ముందుగా ఆ సినిమానే పూర్తి చేశాడు. అయితే, టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్‌తో సినిమా చేశానన్న తృప్తే తప్ప.. అప్పటి నుంచి పరశురాంకు ఏదీ కలిసి రాకపోవడంతో ఇప్పటి వరకకు ఒక్క ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కలేదు. నిజానికి పరశురాం 14 రీల్స్‌ సంస్థలో (14 Reels) సినిమా చేయాల్సి ఉన్నా వర్కవుట్ కాలేదు. కానీ వాళ్లు ఇచ్చిన అడ్వాన్స్ తన దగ్గరే ఉంది. ఇంతలోనే విజయ్ దేవరకొండకు (Vijay Devarakonda) కథ చెప్పి ఒప్పించాడు పరశురాం. దీంతో ‘గీతా గోవిందం’ కాంబినేషన్‌ రిపీట్ కానుండగా.. ఈ మూవీని దిల్ రాజు (Dil Raju) బ్యానర్‌లో చేసేందుకు సైన్ చేశాడు. కానీ గీతా ఆర్ట్స్‌ (Geetha Arts) అంతకుముందే తనకు అడ్వాన్స్ ఇచ్చి ఉండటంతో ఇది వివాదంగా మారింది.

తనకు గతంలోనే అడ్వాన్స్‌లు ఇచ్చిన గీతా ఆర్ట్స్, 14 రీల్స్ ప్లస్‌కు సినిమా చేయకుండా మరో సంస్థలో ప్రాజెక్ట్‌ ప్రకటించడంపై వారు ఇటీవలే ప్రొడ్యూసర్స్ గిల్డ్‌ను సంప్రదించారు. ఇదిలా ఉంటే, విజయ్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఖుషి’ షూటింగ్ పూర్తవగానే పరశురాంతో మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. కానీ అంతకుముందే పరశురాం.. 14 రీల్స్ ప్లస్, గీతా ఆర్ట్స్‌కు బాకీపడ్డ దాదాపు 20 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉంది. అయితే, ఇందుకోసం దిల్ రాజు పరశురాంకు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయ్‌తో తమ మూవీ మొదలవ్వడానికి ముందే ఈ బాకీలను క్లియర్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

100829804

అయితే, పరశురాం బాకీలను చెల్లించనున్న దిల్ రాజు.. తర్వాత అతని రెమ్యూనరేషన్‌లో కట్ చేసుకుంటారని టాక్. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌ను క్విక్ షెడ్యూల్‌లో పూర్తి చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారు? కాస్ట్ అండ్ క్రూ తదితర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. తను హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఖుషి’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇది పూర్తవగానే పరశురాం సినినమాను మొదలు పెట్టనున్నాడు. నిజానికి గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమాను అఫిషియల్‌గా లాంచ్ చేశారు విజయ్. కాప్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ శ్రీలీల.. ప్రభాస్‌కు జోడీగా నటించనుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కంటే ముందే పరశురాం, విజయ్ మూవీ పట్టాలెక్కించే చాన్స్ ఉంది.

Read latest Tollywood updates and Telugu News

2023-06-08T09:49:22Z dg43tfdfdgfd