అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి

  • జలపాతంలో జారిపడి దుర్మరణం

హైదరాబాద్‌ (నమస్తే తెలంగాణ)/న్యూయార్క్‌: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మరణించాడు. ఏపీకి చెందిన సాయి సూర్య అవినాశ్‌(25) అనే విద్యార్థి ప్రమాదవశాత్తూ ఓ జలపాతంలో పడి మృతిచెందారు. నూయార్క్‌లోని అల్బనీలో ఉన్న బార్బర్‌విల్లే జలపాతం చూసేందుకు స్నేహితులతో కలిసి వెళ్లిన అవినాశ్‌.. ప్రమాదవశాత్తూ అందులో జారిపడ్డాడు.

ఈ ఘటన ఈ నెల 7న జరిగిందని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం వెల్లడించింది. అవినాశ్‌ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన అవినాశ్‌ ఎంఎస్‌ చదవడానికి యూఎస్‌ వెళ్లారు.

2024-07-09T20:25:16Z dg43tfdfdgfd