Panchangam Today: మీరు ఏం చేయాలనుకున్న మధ్యాహ్నం మొదలుపెడితే బెటర్
Panchangam Today: నేడు 2024 బుధవారం, ఏప్రిల్ 24, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, చైత్ర మాసం, శుక్లపక్షం, ఇవాళ 5 గంటల 48 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 19 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి కృష్ణ పాడ్యమి (పూర్తి).వారం: సౌమ్యవాసరె నక్షత్రం: స్వాతి, రాత్రి 12గంటల 38 నిమిషాల వరకూ ఉంది. తర్వాత విశాఖ.యోగం: సిద్ది రాత్రి, తెల్లవారుజాము 5గంటల 04 నిమిషాల వరకూ ఉంది. తర్వాత వ్యతీపాతకరణం: బాలవ సాయంత్రం 6 గంటల 01 నిమిషాల వరకూ ఉంది. తర్వాత కౌలవ(పూర్తి)ఉంది. అమృతకాలం మధ్యాహ్నం 3 గంటల 03 నిమిషాల నుంచి 4గంటల 47 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 11గంటల 49 నిమిషాల నుంచి 12గంటల 40నిమిషాల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం మధ్యాహ్నం 12గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం 7గంటల 30 నిమిషాల నుంచి 9గంటల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం తెల్లవారు జామున 4గంటల 35నిమిషాల నుంచి ఉదయం 6 గంటల 20 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.
2024-04-23T21:14:28Z
బర్త్ డే రోజున బోల్డ్ ఫోటోషూట్.. శివాత్మిక రాజశేఖర్ వయసెంతో తెలుసా
హీరో రాజశేఖర్ కూతురుగా శివాత్మిక రాజశేఖర్.. దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా.. నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో రచ్చ చేయడం మొదలుపెట్టింది.(Instagram/Photo) చుట్టు కొలతలు, ముఖ కవళికలు బాగానే ఉన్నప్పటికి ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ అవకాశాలు రావడం లేదు. అయితే చేసిన అర, కొర సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాకపోవడంతో ...సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు తెర తీసింది ఈ స్టార్ కిట్. సోదరి శివాత్మికతో కలిసి కూడా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటారు. (Instagram/Photo) నటిగానే కాకుండా...రీసెంట్ గా బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్న ఈ బ్యూటీ ఆరోజు నాటీ, స్వీటీ ఫోటోలను తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేసింది. అయితే అందరూ ఈ ముద్దుగుమ్మకు బర్త్ డే విషెస్ చెబుతుంటే.. కొందరు నెటిజన్లు మాత్రం శివాత్మిక రాజశేఖర్ ఏజ్ గురించి చర్చించుకుంటున్నారు.(Instagram/Photo) ఈ మధ్య కాలంలో ఈమె సాంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతుంది. ఒకవైపు క్లాస్ లుక్స్‌తో ఫిదా చేస్తూనే మాస్‌ను కిక్కించే ఫోటో షూట్స్‌తో అలరించడం శివాత్మిక స్పెషాలిటీ. రీసెంట్ గా ఫ్లవర్ డిజైన్డ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ పై బ్లూ కలర్ శారీలో అందాల ఆడబొమ్మ అదరగొడుతోంది. (Instagram/Photo) శివాత్మిక లేటెస్ట్ బర్త్ డేతో 23ఏళ్లు నిండి 24వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అందుకే ఈ సుందరి సొగసులు ఆరబోస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏప్రిల్ 22, 2000 లో పుట్టిన హాట్ లేడీ 2019లో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది.(Instagram/Photo) టాలీవుడ్లో ఒకప్పటి స్టార్ హీరో, హీరోయిన్ల కూతురిగా ముద్రపడినప్పటికి శివాత్మిక రాజశేఖర్‌కు హీరోయిన్గా అవకాశాలు రావడం లేదు. వచ్చిన అర, కొర సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో అమ్మడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో హంగామా చేస్తోంది.(Photo:Instagram) గతేడాది క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన రంగమార్తాండ మూవీ కూడా శివాత్మికకు కలిసి రాలేదు. పెద్ద హీరోయిన్ అవుతుందనుకుంటే రంగమార్తాండలో నెగిటివ్ షేడ్ ఉన్న కూతురు పాత్రతో అసలు ఊహించిన దాంట్లో సగం పేరు కూడా రాలేదు తనకు. (Photo:Instagram) శివాత్మిక 22 ఏప్రిల్ 2000లో జన్మించింది. హీరోయిన్గా సరైన అవకాశాలు రాకపోవడంతో ఇపుడు హాట్ షోకు తెరలేపింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు ఇంత ముద్దుగా ఉంటావని అస్సలు అనుకోలేదని కామెంట్ పోస్ట్ చేశాడో అభిమాని.(Instagram/Photo) శివాత్మిక ఇచ్చిన స్టిల్స్ కి కుర్రాళ్లు కవిత్వంతో కూడిన కామెంట్స్ పెడుతున్నారు. బర్త్ డే బేబీ , బేబీ డాల్, నడుము మడత అంటూ శివాత్మిక హాట్ హాట్ అందాలను వర్ణిస్తూ పుట్టిన రోజు విషెస్ చెబుతున్నారు.(Instagram/Photo) ఒకప్పటి స్టార్ హీరో, హీరోయిన్ కుమార్తె అయిన శివాత్మిక ఛాన్సుల కోసం ఇలా చేయాలా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో హిట్ ఉంటేనే గుర్తింపు. కానీ ఈ అమ్మడికి మాత్రం వరుసగా ఫ్లాపులే పలకరిస్తున్నాయి. దీంతో చేసేది లేక అందాల ఆరబోతనే నమ్ముకుంది.(Instagram/Photo) తల్లిదండ్రులు రాజశేఖర్, జీవిత ఇద్దరూ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే అయి ఉండి..శివాత్మిక, శివానీ ఇద్దరూ టాప్ హీరోయిన్లు కాలేకపోయారని నెటిజన్లు ఫీలవుతున్నారు. అయితే శివాత్మిక ఫోటోలకు మాత్రం మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Photo:Instagram)
2024-04-23T12:13:43Z
హోమ్ సినిమా నెక్ట్స్ లెవెల్.. బ్రావియా థియేటర్ క్వాడ్ ప్రారంభించిన సోనీ ఇండియా
హోమ్ ఎంటర్టైన్మెంట్ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లేందుకూ, సినిమాటిక్ అనుభవాన్ని కలిగించేందుకు సోనీ ఇండియా... అద్భుతమైన ఆడియో సిస్టమ్ బ్రావియా థియేటర్ క్వాడ్‌ని ప్రారంభించింది. తద్వారా ఫ్యూచర్ హెూమ్ ఎంటర్టైన్మెంట్ను ఇప్పుడే చూడొచ్చని అంటోంది. వీక్షకులు తమకు ఇష్టమైన సినిమాలు, టీవీ షోలను అద్భుతమైన, ధ్వని నాణ్యతను బ్రివియా థియేటర్ క్వాడ్ ద్వారా అందించడమే కాకుండా... సొగసైన డిజైన్, అత్యాధునిక సాంకేతికతను ఇందులో మిక్స్ చేస్తోంది కంపెనీ. 300 స్పేషియల్ సౌండ్ మ్యాపింగ్, సౌండ్ ఫీల్డ్ ఆప్టిమైజేషన్, ఐమాక్స్, డాల్బీ అట్మాస్ కంపాటిబులిటీ ఫీచర్లతో.. ప్రేక్షకులు తమ ఇళ్లలోనే అద్భుతమైన ఆడియో అనుభవాన్ని పొందేందుకు, థియేటర్ క్వాడ్‌ని తీసుకొచ్చింది సోనీ. "ప్రొఫెషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లో దశాబ్దాల అనుభవం నుంచి, మేము ఒక విలక్షణమైన స్థానాన్ని ఆక్రమించాం. బ్రావియా థియేటర్ క్వాడ్‌తో, మీ కంపెనీ.. సినిమా ఇండస్ట్రీ అనుభవాన్ని, అత్యాధునిక ఆవిష్కరణలతో మిక్స్ చేస్తోంది" అని సోనీ ఇండియా ఆడియో బిజినెస్ హెడ్ షోహీ టయోడా అన్నారు. బ్రావియా థియేటర్ క్వాడ్‌లో రూంకి తగినట్లుగా ఆడియోను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రతీ స్పీకర్ ఎత్తు, పొజిషన్ అన్నీ సెట్ చేసుకోవచ్చు. తద్వారా వినేవారికి.. అన్ని శబ్దాలు.. అత్యంత స్పష్టంగా వినిపిస్తాయి. అందుకే సినీమాటిక్ ఆడియో ఫీల్ కలుగుతుంది. బ్రావియా థియేటర్ క్వాడ్‌లో వాయిస్ జూమ్ 3 అనే ఆప్షన్ ఉంది. దీని ద్వారా డైలాగ్స్ అత్యంత స్పష్టంగా వినిపిస్తాయి. స్పీచ్ క్రిస్టల్ క్లియర్‌గా ఉంటింది. యాక్షన్ ప్యాక్డ్ సీన్స్ లేదా నాయిస్ ఎక్కువగా ఉండే సీన్లలో కూడా ఆడియో స్పష్టంగా ఉంటుంది. ఈ బ్రావియా థియేటర్ క్వాడ్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే.. దీన్ని సోని కంపెనీ తమ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఇంచింది. లేదా.. www.ShopatSC.com పోర్టల్ లేదా ప్రముఖ ఎలక్ట్రానిక్ స్టోర్లు, ఈ కామర్స్ వెబ్సైట్లలో ఏప్రిల్ 22, 2024 నుంచి అమ్ముతోంది. కంపెనీ దీని ధరరు. రూ.1,99,990గా తెలిపింది.
2024-04-23T04:27:02Z