పుష్పరాజ్‌గా బ్రహ్మముడి రాజ్ లోడింగ్.. ఐకాన్ స్టార్‌ని దింపేశాడుగా బుల్లితెర స్టార్

పుష్పరాజ్ వెండితెరను ఏలుతుంటే.. బ్రహ్మముడి రాజ్ బుల్లితెరను ఏలుతున్నాడు. ‘బ్రహ్మముడి’ సీరియల్‌‌తో మానస్ రేంజ్ మారిపోయింది. రాజ్‌గా తన అద్భుత నటనతో మెప్పిస్తున్నారు మానస్ (Maanas Srivastava). టీఆర్పీ రేటింగ్‌లో బ్రహ్మముడి రాజ్ దూకుడు చూపిస్తూ నెంబర్ స్థానంలో కొనసాగుతున్నాడు.

అయితే బ్రహ్మముడి రాజ్.. ఇప్పుడు పుష్పరాజ్‌గా మారాడు. పుష్ప 2లోని అల్లు అర్జున్ గెటప్‌ని దించేస్తూ.. పుష్పరాజ్‌లా మారాడు బ్రహ్మముడి రాజ్. వినాయక చవితి వేడుకలో భాగంగా... స్టార్ మా ఛానల్‌లో ‘గణపతి పప్ప మోరియా’ అనే స్పెషల్ ఈవెంట్‌ని నిర్వహించగా.. ఇందులో పుష్ప రాజ్ గెటప్‌లో స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టేశాడు బ్రహ్మముడి రాజ్.

ఆ గెటప్ కానీ.. మేనరిజమ్ కానీ.. కళ్లల్లో ఆ ఉగ్రం కానీ.. మానస్‌కి పర్ఫెక్ట్‌గా పుష్పరాజ్ గెటప్ సూట్ అయ్యింది. ఈ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. రాజ్-పుష్పరాజ్ అంటూ క్యాప్షన్ పెట్టి వదిలాడు మానస్. దీంతో ఆడియన్స్ నుంచి కామెంట్లు, లైక్‌ల మోత మోగుతోంది.

అన్నట్టు మానస్.. మంచి నటుడే కాదు.. అంతకు మించిన డాన్సర్ కూడా.. మెగాస్టార్‌కి వీరాభిమాని అయిన మానస్.. డాన్స్‌లోనూ ఇరగదీస్తుంటాడు. ఆ మధ్య.. యాంకర్ విష్ణు ప్రియతో జోడీగా చేసిన జారీ జారీ పంచెకట్టి సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేసింది. వీటితో పాటు అనేక సాంగ్స్‌కి మానస్ స్టెప్‌లు వేశాడు.

ఇక మానస్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. వివాహ బంధంతో ఓ ఇంటి వాడుకాబోతున్నాడు మానస్. శ్రీజ (Maanas Srija Engagement) అనే అమ్మాయితో మానస్‌కి ఇటీవల నిశ్చితార్ధం జరగ్గా.. ఆ ఫొటోలు వీడియోలు వైరల్ అయ్యారు. బ్రహ్మముడి సీరియల్‌లో కావ్యతో జతకట్టిన మానస్.. రియల్ లైఫ్‌లో శ్రీజతో జతకట్టాడు.

2023-09-18T09:30:12Z dg43tfdfdgfd