బిగ్ బాస్ హౌస్‌లో స్ట్రైక్ చేస్తున్న శివాజీ, ప్రశాంత్, యావర్.. కెప్టెన్ ప్రియాంక దెబ్బకి SPY బ్యాచ్ విలవిల

బిగ్ బాస్ సీజన్ 7 మరో నాలుగు వారాల్లో ముగియనుండటంతో.. రోజు రోజుకూ లెక్కలు మారిపోతున్నాయి. ఈ సీజన్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన శివాజీ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా నిలిచాడు. తన అనుభవంతో తెలివితో.. మెచ్యూర్డ్ గేమ్ ఆడుతూ.. ఆటలో అందరి కంటే ముందున్నాడు. ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ వరకూ కూడా శివాజీకి తిరుగేలేదు. విన్నర్ ఎవరంటే వినిపించే ఒకే ఒక మాట.. శివాజీ. కానీ ఫ్యామిలీ వీక్ తరువాత ఈ లెక్కలన్నీ మారిపోయాయి.

ఫ్యామిలీ వీక్‌లో భాగంగా.. స్టేజ్ మీదికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా.. శివాజీకే పట్టం కట్టారు. ఇక ఆయనే విన్నర్ అని ఫిక్స్ చేసేశారు. అయితే ఫ్యామిలీ వీక్ తరువాత అసలు ఆట మొదలైంది. నిజానికి ప్రతి సీజన్‌లో ఈ ఫ్యామిలీ వీక్ అనేది 12 వారాల తరువాత ఉండేది. కానీ ఈ సీజన్‌లో పదో వారంలో ఫ్యామిలీ వీక్ మొదలైపోయింది. అయితే ఈ రెండు వారాల్లోనే లెక్కలు మారిపోయాయి.

తనకి తిరుగేలేదనుకున్న శివాజీకి నెగిటివ్ ఎపిసోడ్‌లు పడ్డాయి. గత శనివారం నాటి ఎపిసోడ్‌లో అయితే హోస్ట్ నాగార్జున రోస్ట్ చేసి పారేశారు. ఇప్పటి వరకూ శివాజీ ఎన్ని తప్పులు చేసినా.. ఎవర్ని ఎన్ని మాటలు అన్నా కూడా.. చాలా తెలివిగా తప్పించుకున్న శివాజీ.. మొన్నటి శనివారం ఎపిసోడ్‌లో మాత్రం అడ్డంగా దొరికపోయారు. వీడియోలు చూపించి మరీ శివాజీని ఏకిపారేశారు నాగార్జున. ఇక అతను మాట్లాడే భాషపై కూడా అభ్యంతరం తెలుపుతూ నాగార్జున ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఆ తరువాత జరిగిన నామినేషన్స్‌లో కానీ.. ముందు ఎవిక్షన్ పాస్ టాస్క్‌లో కానీ.. శని, ఆదివారం నాటి ఎపిసోడ్‌లు కానీ.. శివాజీకి నెగిటివ్‌ అయ్యాయి.

మరోవైపు హౌస్‌లో శివాజీ రేలంగి మామయ్య అవతారం ఎత్తితే.. చిన్నోడిగా పల్లవి ప్రశాంత్.. పెద్దోడిగా యావర్‌లు ఉన్నారు. ఇక యావర్‌కి ఎవిక్షన్ పాస్ సంపాదించి పెట్టడం కోసం శివాజీ గొడవకు దిగాడు. అంత కష్టపడి సంపాదించిన ఎవిక్షన్ పాస్‌ని నాగార్జున లాగేసుకోవడంతో ఒక్కసారిగా హౌస్‌లో తిరుగులేదనుకున్న SPY (శివాజీ, ప్రశాంత్, యావర్) బ్యాచ్‌కి గట్టి దెబ్బే తగిలింది. అదే సందర్బంలో అమర్ దీప్ పుంజుకోవడం.. అతని పాజిటివ్ ఎపిసోడ్‌లు పడటమే కాకుండా.. సీరియల్ బ్యాచ్‌ నుంచి మహానటి ప్రియాంక కెప్టెన్ అయ్యింది.

ఇక SPY (శివాజీ, ప్రశాంత్, యావర్) బ్యాచ్‌కి తిప్పలు మొదలయ్యాయి. ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున శివాజీని తిట్టడం.. యావర్‌కి ఎవిక్షన్ పాస్ పోవడం.. ప్రశాంత్‌ని కూడా గేమ్ ఆడటం లేదని నాగార్జున తిట్టడంతో.. ఒక్కసారిగి SPY బ్యాచ్‌కి వరుస దెబ్బలు తగిలి డల్ అయిపోయారు. ఇక నామినేషన్స్‌లో శివాజీ వర్సెస్ ప్రియాంకల మధ్య వాదనలు గట్టిగా జరిగాయి.

ఆ వాదన తరువాత.. లైవ్ ఎపిసోడ్‌‌ చూస్తే.. శివాజీ అలిగి తినడం మానేశాడు. తండ్రి లాంటి శివాజీ తినకపోతే.. కొడుకులు ప్రశాంత్, యావర్‌లు తింటారా? వాళ్లు కూడా తినడం మానేశారు. కెప్టెన్‌గా ఉన్న ప్రియాంక.. తినడానికి రమ్మని పిలిచినా వాళ్లు వెళ్లలేదు. ఆకలి లేదంటూ ముగ్గురూ స్ట్రైక్ చేశారు.

దీంతో ప్రియాంక.. ప్రశాంత్‌, యావర్‌లను ఉద్దేశించి శోభా దగ్గర మాట్లాడుతూ.. వాళ్లకి నచ్చిన వాళ్లని అన్నందుకు వీళ్లు అలిగారంటూ సెటైర్లు వేసింది. ఆ వెంటనే.. ‘ప్రశాంత్ తినవా?’ అంటూ డ్రామాని షురూ చేసింది. మొత్తానికి శివాజీ, ప్రశాంత్, యావర్‌లు అయితే.. ప్రియాంక కెప్టెన్ అయిన తరువాత.. కిచెన్ వైపు వెళ్లడం మానేయడమే కాదు.. తినడమే మానేశారు. మంగళవారం ఉదయం.. ‘ఎవిక్షన్ పాస్ టాస్క్ ప్రారంభం అయ్యే వరకూ కూడా శివాజీ, ప్రశాంత్, యావర్‌‌లు తిండి ముట్టలేదు. ముఖ్యంగా ప్రియాంక.. ఆదిపత్యం.. ఆమె ఓవరాక్షన్‌ని తట్టుకోలేపోతున్నారు స్పై బ్యాచ్. కనీసం బాత్ రూంకి వెళ్లాలన్నా.. ఈమెను అడిగి వెళ్లాల్సిందే అన్నట్టుగా డోర్లు దగ్గర కాపలా కాస్తుంటుంది ప్రియాంక. ఇక తిండి విషయంలో హాస్టల్ వార్డెన్‌లో వ్యవహరిస్తుండటంతో.. శివాజీ, ప్రశాంత్, యావర్‌లు తినడం మానేశారు.

ఆ ముందు శివాజీ కెప్టెన్సీతో మంచి పేరు తెచ్చుకోవాలని చాలా ప్రయత్నించాడు. గారెలనీ.. దోసెలని పాయసం అని అందర్నీ గ్రిప్‌లో పెట్టుకోవడానికి బాగానే కష్టపడ్డారు. గుడ్ కెప్టెన్ అనిపించుకున్నారు కూడా. ఒక్కటి మాత్రం నిజం శివాజీ కెప్టెన్సీలో హౌస్‌లో ఉన్న వాళ్లంతా కడుపునిండా తిన్నారు.

ఇక ప్రియాంక కెప్టెన్ అయ్యిందో లేదో.. ఆకలి కష్టాలు మొదలయ్యాయి. ఆమె 12 వారంలో కెప్టెన్ అయ్యింది కానీ.. గత 12 వారాలుగా కిచెన్‌లో ప్రియాంకదే హవా. అందరికీ వండిపెడుతుంది కానీ.. అది వంటపట్టకుండా మాటలు వదిలేస్తుంటుంది. ఆమె సొమ్ముఏదో ఇంట్లో వాళ్లు తినేస్తున్నారన్నట్టుగా తెగ ఫీల్ అయిపోతుంటుంది. ముఖ్యంగా యావర్, ప్రశాంత్ విషయంలో అయితే.. ఎక్కువ తినొద్దు.. పెరుగు వేసుకోవద్దు.. చపాతీలు వద్దు లాంటి కండిషన్లు పెడుతూ చిరాకు తెప్పిస్తుంది.

ఆమె కెప్టెన్ అయిన తొలిరోజే యావర్‌తో ఇదే గొడవ అయ్యింది. అతనేమో రోటీలు తింటానని.. ఈమె ఏమో వద్దని.. మొత్తానికి ఇద్దరి మధ్య గొడవ అయ్యింది. ఆ తరువాత మహానటి ఇంట్లో ఉన్న వాళ్ల ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి.. నేను తినొద్దని అనను.. నాకు అలా అనడం ఇష్టం ఉండదు అంటూ డ్రామాలను షురూ చేసింది. మొత్తానికి అయితే.. ప్రియాంక కెప్టెన్సీలో SPY బ్యాచ్ (శివాజీ, ప్రశాంత్, యావర్‌)లకు తిండి తిప్పలు తప్పడం లేదు. అయితే తనని కెప్టెన్‌ని చేసిన గౌతమ్‌కి మాత్రం కొసరి కొసరి వడ్డిస్తుంది ప్రియాంక.

2023-11-21T11:16:26Z dg43tfdfdgfd