‘గృహలక్ష్మి’ జూన్ 08 ఎపిసోడ్: లాస్య మొదటి మొగుడొచ్చాడూ.. నీ ప్రేమ కావాలి శేఖర్‌.. నందుకి విడాకులిచ్చేస్తా

Intinti Gruhalakshmi June 08 Today Episode: అబ్బబ్బా.. ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌లో ట్విస్ట్‌లు అదిరిపోయాయి. లాస్య మొదటి మొగుడ్ని వదిలేసి.. నందునిపెళ్లి చేసుకుంది. అయితే ఇప్పటివరకూ ఆమె మొదటి మొగుడు ఎవరనేది ఎవరికీ తెలియదు. అయితే నేటి ఎపిసోడ్‌లో  ఎంట్రీ ఇచ్చాడు లాస్య మొదటి భర్త శేఖర్. 

ఓ వైపు కూతురు దివ్య అత్తింట్లో అష్టకష్టాలు పడుతుంటే.. తల్లి తులసి మాజీ మొగుడ్ని జైలు నుంచి విడిపించుకోవడానికి నానా కష్టాలు పడుతుంది. కేసుని రీ ఓపెన్ చేయించడమే కాకుండా.. బ్రహ్మాస్త్రం దొరికింది అంటూ కీలకమైన సాక్ష్యాన్ని పట్టేస్తుంది. ఇక ఈరోజు (జూన్ 08) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. నందుపై పెట్టిన గృహహింస కేసు రీ ఓపెన్ చేశారని తెలుసుకున్న లాస్య.. ‘కేసు రీ ఓపెన్ చేయించింది అంటే.. అది ఖచ్చితంగా తులసి పనే అని.. ఖచ్చితంగా ఏదో ఆధారం దొరికే ఉంటుంది.. అది ఏంటో తెలుసుకోవాలి’ అని అనుకుంటుంది. ఇంతలో లక్కీ (లాస్య కొడుకు) ఫోన్ చేసి.. వేసవి సెలవులు కదా.. ఇంటికి ఎప్పుడు తీసుకుని వెళ్తావ్ అని అడుగుతాడు. ఖాళీలేదని లాస్య చెప్పడంతో.. ‘నా ప్లాన్‌లో నేను ఉన్నాను.. తులసి ఆంటీ ఇంటికి వెళ్తున్నాను.. నన్ను వచ్చి తీసుకుని వెళ్తానని అన్నది’ అని అంటాడు. తులసి ఆంటీ నీకు ఫోన్ ఎందుకు చేసిందిరా? అని లాస్య అడిగితే.. ‘నిన్ననే చేసింది.. నాన్న గురించి ఏదో అడగడానికి’ అని అంటాడు లక్కీ. ఆ మాట వినగానే లాస్యలో అనుమానం మొదలౌతుంది.

తులసి ఆంటీ.. నాన్న గురించి అడిగింది మమ్మీ..

‘నాన్న గురించా?? ఏం అడిగిందిరా.. అని లాస్య అడగ్గా.. ‘మీ నాన్న గారు ఎక్కడ ఉంటారు? నీతో మాట్లాడతారా? కలుస్తుంటారా? అని అడిగింది అని అంటాడు లక్కీ. ‘మీ నాన్నతో తనకేం పని? అని లాస్య అడగడంతో.. ‘ఏమో తెలియదు.. ఆంటీ చెప్పలేదు’ అని అంటాడు. మరి తులసి ఆంటీకి ఏం చెప్పావ్ అని లాస్య అంటే.. ‘నాకు తెలిసింది అంతా చెప్పాను’ అని అంటాడు లక్కీ. దీంతో కోపంగా ఫోన్ పెట్టేస్తుంది లాస్య. దీంతో లక్కీ.. ఛా.. ఎప్పుడూ ఇంతే.. దేవుడా నాకు భలే అమ్మని ఇచ్చావయ్యా నాకు’ అని బాధపడతాడు లక్కీ.

ఇతనే లాస్య మొదటి భర్త శేఖర్..

ఇక లాస్యకి సీన్ అర్ధం అయిపోతుంది. హడావిడిగా తన మొదటి భర్త శేఖర్‌కి కాల్ చేస్తుంది. ‘నేను శేఖర్.. లాస్యని అని అంటుంది’. ఆ మాటతో లాస్య మొదటి మొగుడు శేఖర్.. ‘పొరపాటున ఫోన్ చేసినట్టు ఉన్నావ్.. నీ మనసులో నుంచి నన్ను డిలీట్ చేసినా... నీ మొబైల్‌లో నుంచి నా ఫోన్ నెంబర్‌ని డిలీట్ చేయలేదా? అని అంటాడు. ఆ మాటతో లాస్య.. లేదు శేఖర్.. నేను నీతో మాట్లాడాలి అని అంటుంది. ‘మాట్లాడుతున్నావ్ కదా.. ఏంటో చెప్పు’ అని అంటాడు. ‘ఇలా కాదు శేఖర్ నీతో పర్సనల్‌గా మాట్లాడాలి’ అని అంటుంది లాస్య.

మెత్తబడ్డ శేఖర్.. మాజీ మొగుడు దగ్గరకు లాస్య

‘మరి ఎలా? ఇంతకు ముందులా పార్కుల్లో కూర్చుని మాట్లాడుకునే వయసూ కాదు.. ఆ ఓపిక ఇంట్రస్ట్ కూడా నాకు లేవు.. అయినా నన్ను కాదనుకుని ఎడం కాలితో తన్నేసి వెళ్లావ్ కదా.. విడాకులు కూడా ఇచ్చేశావ్ కదా.. నాతో నీకేంటి అవసరం’ అని అంటాడు శేఖర్. అలా కాదు శేఖర్.. నేను నిన్ను కలవాలి.. ఎక్కడ ఉన్నావ్ అని అడుగుతుంది లాస్య. ఆ మాటతో మెత్తబడ్డ శేఖర్.. ‘ఇంటి దగ్గరే ఉన్నాను’ అని అంటాడు. సరే లొకేషన్ షేర్ చేయి.. వెంటనే బయల్దేరుతున్నాను.. నేను వచ్చేవరకూ ఇంట్లోనే ఉండు శేఖర్.. నేను వచ్చేవరకూ ఎక్కడికీ వెళ్లకు.. అర్జెంట్ పని ఉంది’ అని కవ్విస్తూ మాట్లాడుతుంది లాస్య. దీంతో శేఖర్ సరే.. రమ్మని అంటాడు. ఇక లాస్య.. మాజీ మొగుడు శేఖర్ దగ్గరకు బయల్దేరుతుంది.

నందు నరకం చూపిస్తున్నాడు.. అతనికి విడాకులు ఇచ్చేసి నీతోనే ఉంటా శేఖర్

శేఖర్ ఇంటికి వెళ్లిన లాస్య.. వలపు వల విసిరి మొత్తానికి మాజీ మొగుడ్ని పడగొట్టేస్తుంది. మొసలి కన్నీళ్లు కార్చుతూ.. శేఖర్ ఒడిలో ఒదిగిపోతుంది. జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు ఏదైనా ఉందంటే.. అది నిన్ను వదులుకోవడం.. నీకు విడాకులు ఇవ్వడం.. ఇప్పుడు నీ విలువ ఏంటో తెలుస్తుంది శేఖర్.. నందుని పెళ్లి చేసుకుని తప్పు చేశాను.. నాకు నరకం చూపిస్తున్నాడు.. అతనితో నేను ఏమాత్రం కలిసి ఉండలేను.. అతనికి విడాకులు ఇచ్చేస్తాను.. నీ దగ్గరకు వచ్చేస్తాను.. ప్లీజ్ కాదనకు’ అంటూ బోరు బోరున ఏడుస్తుంది లాస్య.

నీ ప్రేమ నాకు కావాలి శేఖర్.. వాటే యాక్టింగ్ బేబీ

లాస్య కన్నీళ్లను చూసి.. నిజమే అని నమ్మని శేఖర్.. ఏంటి చిన్న పిల్లలా?? ఏడ్వకు అని లాస్యని దగ్గరకు తీసుకుని ఓదార్చుతాడు. ‘నాకు కావాల్సింది ఈ ప్రేమే శేఖర్.. నందు నా కన్నీళ్లను కూడా పట్టించుకోవడం లేదు.. నీ ప్రేమ నాకు కావాలి శేఖర్’ అని ప్రేమ ఒలకబోస్తుంది లాస్య. దీంతో శేఖర్.. లాస్య దగ్గర నుంచి పైకి లేచి.. ‘నువ్వు మనసు మార్చుకుని నా దగ్గరకు రాలేదు.. నందుకి విడాకులు ఇవ్వాలనే ఆలోచన కూడా నీకు లేదు.. నందుని గృహహింస కేసులో ఇరికించి ఐదేళ్లు శిక్ష పడేట్టు చేశావ్.. నువ్వు నాకు దూరం అయినా.. నీ అరాచకాలు అన్నీ నాకు తెలుసు. ఇక ముసుగు తీసి మాట్లాడు.. నువ్ ఎందుకు వచ్చావ్.. నీకేం కావాలి’ అని అంటాడు శేఖర్.

అమ్మ లాస్యా.. శేఖర్‌ని మత్తుచ్చి మడతెట్టేసింది

దీంతో లాస్య.. ఇక వీడితో మాట్లాడి లాభం లేదనుకుని.. తనలోని రాక్షసిని బయటకు తీస్తుంది. తనతో పాటు తెచ్చుకున్న మత్తు స్ప్రేని శేఖర్‌పై కొట్టి.. సృహ తప్పేట్టు చేస్తుంది. ‘నాకేం కావాలి అని అడిగావ్ కదూ.. కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించడానికి నీకోసం తులసి వస్తుంది.. ఈరోజే వాదనలు.. ఈ ఒక్కరోజు నిన్ను తులసికి దొరక్కుండా చేస్తే చాలు’ అని సృహ తప్పి పడి ఉన్న శేఖర్‌తో అంటుంది లాస్య. అనంతరం రౌడీలను పిలిచి.. ‘రేయ్ వీడ్ని ఎత్తుకెళ్లి కారులో పడేయండి’ అని అంటుంది. మొత్తానికి ఈ సీన్‌తో తనలోని విలనిజాన్ని అద్భుతంగా పండించింది లాస్య. ప్రేమ, పగ, కోపం, సరసాలను మిక్స్ చేసి హావభావాలను పలికిస్తూ ఈ లేడీ విలన్ అదరగొట్టేసింది.

పాపం శేఖర్.. లాస్య చేతిలో బంధీగా

ఇక తులసి, దిలీప్‌లు అయితే.. తులసి మాజీ మొగుడు శేఖర్ ఫొటో పట్టుకుని వెతుకుతూ ఉంటారు. లాస్య.. శేఖర్‌ని కారులో ఒక రహస్య ప్రదేశానికి తీసుకుని వెళ్లి.. బంధించి రౌడీలను కాపలాగా పెడుతుంది. ‘మర్యాదగా చెప్తే వీడు వినడు.. నీకు ఇదే శిక్ష.. రేపు సాయంత్రం వరకూ వీడ్ని ఇలాగే ఉంచండి.. నోటికి ప్లాస్టర్ వేయండి’ అని రౌడీలతో చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది లాస్య. ఇక మొదటి మొగుడు నుంచి నేరుగా.. రెండో మొగుడు దగ్గరకు వెళ్తుంది. అయితే లాస్య వచ్చిందంటే నందు కలవడని.. తులసి వచ్చిందని చెప్తుంది. ఇక తులసి అనగానే మనోడు రంకెలేసుకుంటూ వచ్చేస్తాడు.

లాస్యని చూసి రంకెలేసిన నందు

ఎదురుగా లాస్యని చూసి పక్కనే ఉన్న కానిస్టేబుల్‌తో తులసి వచ్చిందని చెప్పావ్.. ఇది వచ్చిందేంటి? అని అంటాడు. ‘సారీ నందూ అబద్దం చెప్పాల్సి వచ్చింది.. వచ్చింది నేనంటే నువ్వు రావుగా.. తులసి రాలేదని నిరాశపడుతున్నట్టు ఉన్నావ్.. ఇది జైలు అయ్యింది కాబట్టి నన్ను ఇలా వదిలేశావ్ ఏమో.. లేదంటే ఇక్కడ కూడా మెడపట్టి గెంటేసే వాడివేమో అని అంటుంది లాస్య. ఆ మాటతో మన ఆవేశం స్టార్.. ఖచ్చితంగా అని అంటాడు. ‘అప్పుడు ఐదేళ్ల శిక్ష పదేళ్లు అవుతుంది.. బయటకు వచ్చేసరకి చేతిలో చేతి కర్ర ఉండేది’ అని సెటైర్లు వేస్తుంది లాస్య. దీంతో నందు.. ఏయ్ అంటూ రంకెలేస్తుంటాడు.

నీకో గుడ్ న్యూస్ నందూ.. నా మాజీ పెళ్లం కేసు రీ ఓపెన్ చేయిచింది కానీ..

కూల్ నందూ.. నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను.. నీ మాజీ భార్య కేసు రీ ఓపెన్ చేయించింది.. ఎంత ప్రేమో కదూ.. నాకు వ్యతిరేకంగా సాక్షిని కూడా రీ ఓపెన్ చేయించింది.. ఆ సాక్షి జడ్జీ ముందు నోరు విప్పారంటే నిమిషంలో నువ్వు విడుదల అవుతావ్.. చూశావా? ఎంత శుభవార్త మోసుకుని వచ్చానో.. కాస్త నవ్వొచ్చు కదా.. అని అంటుంది. గుడ్ న్యూస్ విన్నావ్ కదా.. ఇప్పుడు బ్యాడ్ న్యూస్.. ఆ సాక్షి ఇప్పుడు నా దగ్గర బంధీగా ఉన్నాడు. ఎంత వెతికినా తులసికి దొరకడు.. కోర్టులో మళ్లీ మొట్టికాయలు తప్పవు’ అని అంటుంది లాస్య.

రా నందూ.. తులసి చేయి వదిలేసి నా చేయి పట్టుకో.. హ్యాపీగా ఉందాం

ఛీ ఛీ దొంగదొబ్బలు తీయడానికి సిగ్గులేదా? నీకు అని నందు అనడంతో.. ఆ ప్రశ్నకి సమాధానం నీకు తెలుసు కదా.. మళ్లీ అదే ఎందుకు అడుగుతున్నావ్.. సర్లే నీకు మళ్లీ ఆఫర్ ఇవ్వడానికి వచ్చాను.. తులసిని వదిలేసి నా చేయి పట్టుకో.. ఎప్పటిలాగే హ్యాపీగా ఉందాం.. అని అంటుంది లాస్య. ఆ మాటతో నందు.. నేను నీ పక్కన ఉంటే కసితీరా చెంపపగలకొట్టేవాడ్ని అని అంటాడు. అలా కొట్టినందుకే కదరా మగడా ఇలా బొక్కలో ఉన్నావ్ అని లాస్య ఓ చూపు చూస్తుంది. వీడికి జైలే కరెక్ట్.. బతకడం చేతకాదు అని ఛీ కొట్టి నందు దగ్గర నుంచి వచ్చేస్తుంది లాస్య.

తులసి అక్కా!! లాస్య తన మొదటి మొగుడ్ని కిడ్నాప్ చేసింది

ఇక తులసి అయితే.. చేతులు నలిపేసుకుంటూ తెగ టెన్షన్ పడిపోతూ పెర్ఫామెన్స్ చూపిస్తూ ఉంటుంది. ఇంతలో దిలీప్ వచ్చి.. కేసు రీ ఓపెన్ చేయించి తప్పు చేశామా.. లాస్య మాజీ భర్త దొరక్క పోతే.. మనం ఇబ్బందుల్లో పడతాం అక్కా అని అంటాడు. ‘నో దొరుకుతాడు.. దొరికేట్టు చేస్తాను.. అధైర్య పడకూడదు’ అని అంటుంది తులసి. ఇంతలో లాస్య దగ్గరే ఉంటూ తనని వెన్ను పోటు పొడుస్తున్న భాగ్య.. తులసికి ఫోన్ చేసి.. లాస్య మాజీ భర్త శేఖర్ ఆమె దగ్గరే ఉన్నాడు.. కిడ్నాప్ చేసిందని చెప్తుంది. ఆ మాటతో తులసి షాక్ అవుతుంది. ఎక్కడ దాచిపెట్టింది భాగ్యా.. నీతో క్లోజ్‌గానే ఉంటుంది కదా.. నీతో చెప్పలేదా? అని అడుగుతుంది తులసి.

కథ క్లైమాక్స్ వచ్చింది తమ్ముడూ.. తప్పు చేయొద్దు

‘లేదు తులసి అక్కా.. నేను నిన్ను కలిసినప్పటి నుంచీ నన్ను దూరం పెట్టింది.. అన్ని విషయాలూ చెప్పడం లేదు’ అని అంటుంది. సర్లే నీకు దాచిన ప్లేస్ తెలిస్తే మాత్రం వెంటనే చెప్పు’ అని అంటుంది తులసి. సరేనని అంటుంది భాగ్య. ఇక తులసి.. శేఖర్ ఎక్కడున్నాడో తెలియడం లేదని టెన్షన్ పడుతుంటే.. ‘అక్కా లాస్యని లాక్కొచ్చి నాలుగు పీకితే అదే చెప్తుంది నాకు వదిలిపెట్టు’ అని అంటాడు. ఇలా ఆవేశపడే మీ బావ పీకలపైకి తెచ్చుకున్నాడు. నువ్వు కూడా అదే తప్పు చేయకు.. కథ క్లైమాక్స్‌కి వచ్చింది.. అడుగులు జాగ్రత్తగా వేయాలి.. ఎలాగైనా శేఖర్ ఉన్న ప్లేస్‌ని తెలుసుకుని లాస్యకి తెలియకుండా కోర్టులో సాక్ష్యం చెప్పించాలి’ అని అంటుంది.

శేఖర్ వచ్చేశాడూ.. రేపటి నుంచి అదే కథ

ఇక రేపటి ఎపిసోడ్‌లో ‘నా మాజీ మొగుడ్ని జైలు నుంచి విడిపిస్తానంటూ లాస్యతో శపథం చేస్తుంది తులసి. సాక్ష్యం విషయంలో తప్పటడుగు వేస్తే.. నీ మాజీ మొగుడితో పాటు నిన్ను కూడా జైల్లో వేస్తారని చెప్తుంది లాస్య. ఇక చివరి క్షణంలో సాక్షి శేఖర్ రాకపోవడంతో.. తులసికి కోర్టులో అక్షింతలు పడుతున్నాయి. అయితే క్లైమాక్స్‌లో శేఖర్.. నేను వచ్చేశా సార్ అంటూ పరుగుపెట్టుకుంటూ వచ్చి.. లాస్యకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఇంకేముంది.. రేపటి నుంచి తులసి-నందులు ఆ ఇంటికి.. లాస్య ఈ ఇంటికి.. మళ్లీ సినిమా స్టార్ట్. మొత్తానికి నేటి ఎపిసోడ్‌ చూసిన తరువాత అనిపించింది ఏంటంటే.. లాస్య మొదటి మొగుడు శేఖర్.. నందు కంటే స్మార్ట్‌గా ఉన్నాడు. అలాంటోడ్ని వదిలేసి ఈ ముసలోడి వెనుకాల ఎందుకు పడిందబ్బా.

2023-06-08T04:14:32Z dg43tfdfdgfd