BRAHMAMUDI RAJ: ఎవరమ్మా నువ్వు ఇంత టాలెంటడ్‌గా ఉన్నావ్.. ఫ్యాన్ దెబ్బకు అవాక్కైన మానస్!

బ్రహ్మముడి సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు మానస్. ఈ సీరియల్‌లో హీరో రాజ్ పాత్రలో మానస్ యాక్టింగ్ ఇరగదీస్తున్నాడు. కామెడీ, ఎమోషన్స్ ఇలా సీన్ ఏదైనా తనదైన నటనతో ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా కావ్య-రాజ్ మధ్య జరిగే సరాదా సంభాషణలు, సవాల్ విసిరే సీన్లు అయితే వేరే లెవల్‌లో ఉంటున్నాయి. ఇక అసలు మేటర్ ఏంటంటే మానస్.. ప్యారా కుల్హద్ (PYAARA KULHAD) అంటూ ఓ హిందీ సినిమా చేశాడు. ఇందులో హీరోయిన్‌గా అప్సర రాణి నటించింది. ఈ ప్రమోషన్స్‌ కోసం ముంబయిలో బిజీగా ఉన్నాడు మానస్. అయితే హోటల్‌లో ఖాళీగా ఉండటంతో సరదాగా ఓ రీల్ చేశాడు మానస్. దీని కింద ఫ్యాన్స్ పెట్టిన కామెంట్లు చూసి అవాక్కయ్యాడు.

నా దగ్గరికి రా

గజిని సినిమాలోని 'ఒక మారు కలిసిన అందం' బీజీఎమ్‌తో సరదాగా మానస్ రీల్ చేసి పోస్ట్ చేశాడు. ఇంకేముంది బ్రహ్మముడి సీరియల్ ఫ్యాన్స్ తగులుకున్నారు. "బోర్ కొడుతుందా మానస్, మా కోసం లైవ్ పెట్టొచ్చుగా నిన్ను చూస్తాం, లవర్ బాయ్, ఒక రిప్లై ఇవ్వొచ్చుగా" అంటూ తెగ కామెంట్లు పెట్టారు. అయితే ఒక లేడీ ఫ్యాన్ మాత్రం.. "నా దగ్గరికి రా పట్టలేని ప్రేమను చూపిస్తాను.. అప్పుడు బోర్ ఉండదు" అంటూ కామెంట్ పెట్టింది. ఇది చూసి అవాక్కయిన మానస్ ఆ కామెంట్‌కు రిప్లై ఇచ్చాడు. "ఎవరమ్మా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు" అంటూ ఫన్నీగా పెట్టాడు. "నేను మీ కట్ ఔట్, క్యారెక్టర్‌కు డై హార్ట్ ఫ్యాన్ సార్" దీనికి మళ్లీ రిప్లై ఇచ్చింది ఆ యూజర్.

ఇలా తన రీల్‌కు కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి ఓపికగా రిప్లై ఇచ్చాడు మానస్. ఇందులో ఓ యూజర్.. "సన్నీ భయ్యా ఎలా ఉన్నాడు మానస్ అన్నా" అని అడిగితే వీజే సన్నీకి ట్యాగ్ చేసి "రేయ్ ఎలా ఉన్నావో అంట చెప్పరా" అని రిప్లై ఇచ్చాడు మానస్.

100494390

ఏది వచ్చినా

బయట కూడా చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటాడు మానస్. బిగ్‌బాస్ హౌస్‌లో తన ఆటతీరు, క్యారెక్టర్‌తో అందరినీ ఆకట్టుకొని మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. ఇప్పుడు అటు సీరియల్స్, ఇటు సినిమాలు.. అప్పుడప్పుడూ ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా మానస్ డ్యాన్స్‌ సూపర్‌గా చేస్తాడు. యాంకర్ విష్ణుప్రియతో చేసిన రెండూ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా హిందీలో హీరోగా చేస్తున్నాడు మానస్. ఆయన సినిమా హిట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read latest TV News and Movie Updates

2023-05-25T09:23:52Z dg43tfdfdgfd