KRISHNA MUKUNDA MURARI TODAY ఏప్రిల్ 24 ఎపిసోడ్: ‘ఐ లవ్యూ ముకుందా.. పెళ్లి చేసుకుందాం’ ప్రపోజ్ చేసిన ఆదర్శ్

Krishna Mukunda Murari April 24 Episode: ముకుంద కుట్రలు చేయడం ఆపలేదు. ఇక ఆదర్శ్.. తన ప్రేమను మీరా ముందు పెట్టడమే నేటి కథనంలో షాకింగ్ ట్విస్ట్. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం.   (photo courtesy by star maa and disney+ hotstar)

Krishna Mukunda Murari 2024 April 24 Episode: కృష్ణకు గర్భసంచి తీసెయ్యాలని డాక్టర్ పరిమళ చెప్పడం.. ముకుంద చాటుగా విని సంబరపడిపోవడం ఓ ఎత్తు అయితే.. మురారీ అల్లాడిపోవడం మరో ఎత్తు. ఈ క్రమంలోనే మురారీకి బాధ ఆగదు. అలానే భార్య ముందు బయటపడకుండా గడుపుతూ ఉంటాడు. అయితే ఈ ఆవేదనను చెప్పుకోవడానికి దేవుడు దగ్గర దీపం వెలిగించి.. దన్నం పెట్టుకుంటాడు. అంతా తెలిసిన ముకుంద మనసులో.. ‘బిడ్డలు పుట్టరని తెలిసి దేవుడికి మొక్కుకోవడానికి వచ్చినట్లు ఉన్నాడు.. ఇదే సరైన సమయం’ అనుకుంటూ ఎదురుగా వెళ్లి.. ‘మీకేం కష్టం మురారీ గారు.. ఎందుకు దేవుడికి పూజ చేస్తున్నారు?’ అంటూ మాట కలుపుతుంది కావాలనే. ‘అబ్బే ఏం లేదండి.. ఊరికే ఇలా వచ్చాను.. మీరు దన్నం పెట్టుకోవడానికి వచ్చినట్లు ఉన్నారు. మీరు కానివ్వండి’అంటూ వెళ్లబోతాడు మురారీ.ఇన్ డైరెక్ట్‌గా ముకుంద స్కెచ్..

‘అవును మురారీ గారు.. నేను మాత్రం దేవుడికి మొరపెట్టుకోవడానికే వచ్చాను. నా స్నేహితురాలికి క్యాన్సర్. ఆ విషయం ఆమెకు తెలియదు. తెలిసిన నేను.. తనని కలుస్తూ ఉంటే.. ఎక్కడ నిజం చెప్పేస్తానో అని కలవడం మానేశాను. తనను దూరం పెట్టేశాను. నిజం తెలియకపోతే నాలుగు రోజులు ఎక్కువ బతుకుందని ఆశ.. తనకోసం దన్నం పెట్టుకుందామని దేవుడి దగ్గరకు వచ్చాను’అంటూ కావాలనే మురారీ మనసులో ఓ ఆలోచనను కలిగిస్తుంది ముకుంద. ‘ఈ మీరా కూడా ఇంచుమించు నా పరిస్థితిలోనే ఉంది. తను అన్నట్లే.. కృష్ణకు నేను ఈ నిజాన్ని చెప్పకుండా ఉండాలంటే.. తనకు నేను దూరంగా ఉండటం మంచిది’ అని ఫిక్స్ అవుతాడు మురారీ.

ఆదర్శ్ పెళ్లి విషయంలో ఆకట్టుకున్న భవానీ దేవి మాటలు..

ఇక కృష్ణ దగ్గరకు వచ్చి.. ఎంత ప్రేమగా మాట్లాడినా మురారీ.. పట్టనట్లుగా.. దూరం పెట్టినట్లుగా మాట్లాడేస్తూ ఉంటాడు మురారీ. ఇక మరోవైపు మురారీ.. పరిమళ దగ్గరకు బయలుదేరతాడు. అది అలా ఉండగా.. భవానీ దేవి దగ్గరకు వెళ్లిన రేవతి.. ‘అక్కా ఆదర్శ్ మళ్లీ నా దగ్గరకు వచ్చి.. మీరాతో తన పెళ్లి విషయం అడగమన్నాడు. ఏం ఆలోచించారో చెప్పండి అక్కా’ అంటుంది. ‘ఏంటి ఆలోచించేది. వాడు కృష్ణ మీద కోపంగా ఎందుకు ఉంటున్నాడో తెలియదు. పైగా మీరాని ఒప్పించి పెళ్లి చేయడం అయ్యే సని కాదు కదా?

వారం రోజుల్లోనే ఆపరేషన్

అసలు మీరా మనసులో ఏముందో తెలియదు కదా.. ఆలోచిద్దాం, ముందు మాత్రం కృష్ణ విషయంలో ఆదర్శ్ ఎందుకు కోపంగా ఉన్నాడో తెలియాలి.. అప్పటి దాకా ఏ నిర్ణయం తీసుకోవద్దు’ అంటూరేవతిని పంపించేస్తుంది భవానీ దేవి. ఇక డాక్టర్ పరిమళను కలిసిన మురారీ.. ‘కృష్ణకు నిజం చెప్పడం నావల్ల కావడం లేదు పరిమళ’ అంటాడు. ‘మురారీ బాగా ఆలోచించు.. కృష్ణకు తెలియకుండా ఎంతకాలం దాస్తావ్? చెప్పేస్తే ఆ గాయం నెమ్మదిగా మానుతుంది కదా.. ఆలోచించు.. వారం రోజుల్లో నేను అమెరికా వెళ్లే పని ఉంది. నువ్వు త్వరగా కృష్ణకు చెబితే ఆపరేషన్ చేసే వెళ్లిపోతాను’ అంటుంది పరిమళ.

ఐ లవ్యూ ముకుందా..

పరిమిళ అలా చెప్పడంతో.. మురారీ బాధగా అక్కడి నుంచి.. ఇంటికి వెళ్లిపోతాడు. ఇక కమింగ్ అప్‌లో ఆదర్శ్.. మీరా ముందు మోకాళ్లపై కూర్చుని.. పువ్వులు ఇస్తూ.. ‘ఐ లవ్వూ ముకుందా.. నీకు ఇష్టమైతే మనం పెళ్లి చేసుకుందాం’ అంటూ ప్రపోజ్ చేస్తాడు. దాంతో మీరా.. బిత్తరపోతుంది. మరోవైపు ఆ సీన్ చూసిన మురారీ, కృష్ణలు మరింత షాక్ అవుతారు. అయితే కృష్ణ బాధగా.. ఆదర్శ్ ముందుకు వచ్చి.. ఆదర్శ్ చేతిలోని పువ్వల్ని తను లాక్కోవడమే ఉత్కంఠగా మారింది. మరేం రచ్చ అవుతుందో చూడాలి. ఈ రచ్చకు భవానీ దేవి వస్తుందో లేదో తెలియాలి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-24T07:44:00Z dg43tfdfdgfd