అభిమానులతో టైటిల్‌ రిలీజ్‌

మహేష్‌ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ నెల 31న దివంగత సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతిని పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నారు. అభిమానుల చేతుల మీదుగా థియేటర్లలో టైటిల్‌ ఆవిష్కరణ ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాకు అయోధ్యలో అర్జునుడు, అమరావతికి అటు ఇటు, గుంటూరు కారం అనే టైటిల్స్‌ ప్రచారంలోకి వచ్చాయి.

అయితే మరికొద్ది రోజుల్లో టైటిల్‌ సస్పెన్స్‌ వీడనుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్‌-మహేష్‌బాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’ ‘ఖలేజా’ చిత్రాలు చక్కటి విజయాలు సాధించడంతో ఈ హ్యాట్రిక్‌ సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ చిత్రంలో పూజాహెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.

2023-05-26T21:20:39Z dg43tfdfdgfd