దర్శకుడు కె. వాసు కన్నుమూత

తెలుగు తెరపై పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు కె.వాసు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

‘ప్రాణం ఖరీదు’, ‘కోతల రాయుడు’, ‘తోడు దొంగలు’, ‘అల్లుళ్లొస్తున్నారు’, ‘పల్లెటూరి పెళ్లాం’, ‘పక్కింటి అమ్మాయి’, ‘అమెరికా అల్లుడు’ తదితర చిత్రాలకు కె వాసు దర్శకత్వం వహించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

2023-05-26T22:20:43Z dg43tfdfdgfd