ప్రేమ పయనంలో..

సిద్ధార్థ్‌, దివ్యాంశ కౌశిక్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘టక్కర్‌’. కార్తీక్‌ జి క్రిష్‌ దర్శకుడు. జూన్‌ 9న తమిళ, తెలుగు భాషల్లో విడుదలకానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఊపిరే’ అనే పాటను విడుదల చేశారు. కృష్ణకాంత్‌ రచించిన ఈ పాటకు నివాస్‌ కె ప్రసన్న స్వరాల్ని అందించారు.

ప్రేమలోని మధుర భావాల్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. దర్శకుడు మాట్లాడుతూ ‘రొమాంటిక్‌ యాక్షన్‌ చిత్రమిది. సిద్ధార్థ్‌ పాత్ర మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుంది. సిద్దార్థ్‌ కెరీర్‌లో ఓ విభిన్న చిత్రంగా నిలిచిపోతుంది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: వాంచినాథన్‌ మురుగేశన్‌, సంగీతం: నివాస్‌ కె ప్రసన్న, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్‌, రచన-దర్శకత్వం: కార్తీక్‌ జి క్రిష్‌.

2023-05-26T21:35:42Z dg43tfdfdgfd