స్టూడెంట్‌ అందించే సందేశం

బెల్లంకొండ గణేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘నేను స్టూడెంట్‌ సార్‌’. రాఖీ ఉప్పలపాటి దర్శకుడు. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సతీష్‌వర్మ నిర్మిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశమిది. జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. యు.ఎ. సర్టిఫికెట్‌ లభించింది. చక్కటి సందేశంతో కూడిన చిత్రమిదని సెన్సార్‌ సభ్యులు అభినందించారని చిత్రబృందం పేర్కొంది.

దర్శకుడు మాట్లాడుతూ ‘ఆద్యంతం ఉత్కంఠభరితమైన కథ, కథనాలతో ఈ సినిమా సాగుతుంది. వినూత్నమైన కథతో తెరకెక్కిస్తున్నాం. కాలేజీ నేపథ్యంలో చక్కటి సందేశాన్ని అందిస్తుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్‌, సంభాషణలు: కల్యాణ్‌ చక్రవర్తి, దర్శకత్వం: రాఖీ ఉప్పలపాటి.

2023-05-26T21:50:40Z dg43tfdfdgfd