BoyapatiRapo | రామ్ హీరోగా ప్రస్తుతం తన తొలి పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకుడు. జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. శ్రీలీల నాయికగా నటిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా ముందస్తు షెడ్యూల్ ప్రకారం దసరా పండుగకు అక్టోబర్ 20న విడుదల చేయాలని నిర్ణయించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం మరో నెల ముందుగానే అంటే సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. సినిమా పనులు తుది దశకు చేరడంతో అప్పటిదాకా వేచి చూడటం ఎందుకనేది చిత్రబృందం ఆలోచనగా కనిపిస్తున్నది. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నది. ఇటీవలే రామ్ పుట్టినరోజుకు విడుదల చేసిన ఫస్ట్ థండర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
2023-05-26T22:35:41Z dg43tfdfdgfd