Devil | నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం డెవిల్ (Devil – The British Secret Agent). పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నవీన్ మేడారం (Naveen Medaram) దర్శకత్వం వహిస్తున్నాడు. మాలీవుడ్ భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమా నుంచి మాయే చేసి సాంగ్ (Maaye Chesi)ను విడుదల చేశారు మేకర్స్. సత్య ఆర్‌వీ రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడాడు.
హీరోహీరోయిన్ల మధ్య సాగే ట్రాక్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడం ఖాయమని విజువల్స్ చెబుతున్నాయి. డెవిల్ నవంబర్ 24, 2023న థియేటర్లలోకి రానుంది. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తోపాటు గ్లింప్స్ వీడియో ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.
పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న డెవిల్‌ను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌లో అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథనందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
మాయే చేసి లిరికల్ వీడియో సాంగ్..
డెవిల్ ఫస్ట్ లుక్..
ఎయిర్‌పోర్టులో కల్యాణ్ రామ్..