DHRUVA NATCHATHIRAM | విక్రమ్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. ధ్రువ నక్షత్రం నయా అప్‌డేట్

Dhruva Natchathiram | కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్‌ (Vikram) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ధ్రువ నక్షత్రం : యుద్ద కాండం (Dhruva Natchathiram). గౌత‌మ్ వాసు దేవ్ మీనన్ (Gautham Menon) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విక్రమ్‌ పుట్టినరోజు సందర్భంగా లాంఛ్ చేసిన ధ్రువ నక్షత్రం కొత్త పోస్టర్‌ నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. తాజాగా విక్రమ్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ అందించారు మేకర్స్‌. ఈ చిత్రం జులై 14న థియేటర్లలో సందడి చేయనుంది.

పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తవగా.. మేకర్స్ త్వరలోనే కొత్త ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ధ్రువ నక్షత్రంలో ఐశ్వర్యారాజేశ్‌, సిమ్రాన్‌, రాధికాతోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒండ్రగ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొండదువోం ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎస్కేప్‌ ఆర్టిస్ట్స్‌ మోషన్స్ పిక్చర్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ధ్రువ నక్షత్రం చిత్రానికి యువ సంగీత దర్శకుడు హరీష్‌ జైరాజ్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఈ మూవీలో రీతూవర్మ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. విక్రమ్‌ మరోవైపు పా రంజిత్‌ దర్శకత్వంలో తంగలాన్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. తంగలాన్ మేకింగ్ గ్లింప్స్‌ వీడియో ఇప్పటికే నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీఎఫ్‌)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్‌ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు.

 

రన్‌ వేపై విక్రమ్‌ టీం.. 

తంగలాన్ మేకింగ్ గ్లింప్స్‌ వీడియో..

2023-05-25T11:35:08Z dg43tfdfdgfd