Kushi Kapoor | ఇండస్ట్రీలో స్టార్ హీరోహీరోయిన్లకు సంబంధించిన వార్తలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఆ స్టార్‌కిడ్స్ వారసుల అప్‌డేట్స్ కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతుంటాయి. ఇప్పుడలాంటి వార్తే ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి (Sridevi) కూతురు, స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) కుమారుడి కాంబోలో సినిమా వస్తుందంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఆ న్యూసే బీటౌన్‌లో హల్ చల్ చేస్తోంది. శ్రీదేవి కూతురంటే జాన్వీకపూర్ కాదు.. చిన్న కూతురు ఖుషీ కపూర్ (Kushi Kapoor).
సూపర్ హిట్ తమిళ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ లవ్ టుడే హిందీ రీమేక్‌లో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ (Junaid Khan), ఖుషీ కపూర్ కలిసి కనిపించబోతున్నారన్న అప్‌డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. సీక్రెట్ సూపర్ స్టార్, లాల్ సింగ్ చడ్డా ఫేం అద్వైత్ చందన్ లవ్ టుడే హిందీ వెర్షన్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడట. ఫాంటోమ్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ.. ఇవానా హీరోయిన్‌గా తెరకెక్కిన లవ్ టుడే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. రీమేక్ జులైలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు సమాచారం.
లవ్ టుడే హిందీ రీమేక్ జునైద్ ఖాన్, ఖుషీ కపూర్‌కు రెండో ప్రాజెక్ట్. జునైద్ ఖాన్ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై సిద్దార్థ్ పీ మల్హోత్రా డైరెక్షన్‌లో తెరకెక్కించిన థ్రిల్లర్ మహారాజాతో ఎంట్రీ ఇచ్చాడు. జోయా అఖ్తర్ నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ ది అర్చీస్‌తో డెబ్యూ ఇచ్చింది.
2023-05-25T09:20:05Z dg43tfdfdgfd