MEGA HEROES | మెగా అభిమానులకు పండగే.. నెల గ్యాప్‌లోనే మూడు సినిమాలు

Mega Heroes | త్వరలోనే మూవీ లవర్స్‌ను ఊపిరాడకుండా చేసేందుకు బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు రెడీ అంటున్నాయి. ప్రత్యేకించి మెగా అభిమానులకు మరికొన్ని రోజుల్లో మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి తమ అభిమాన హీరోల (Mega Heroes) సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌ సినిమాలు కొన్ని రోజుల వ్యవధిలో విడుదల కాబోతుండటంతో అభిమానులు ఆనందంలో ఎగిరి గంతేస్తున్నారు.

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తోన్న చిత్రం బ్రో (Bro The Avatar). సముద్రఖని  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) మరో లీడ్ రోల్‌ చేస్తున్నాడు. ఈ చిత్రం జులై 28న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలకు రెడీ అవుతుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్‌, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్‌ థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరోవైపు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ చేస్తున్న మూవీ భోళా శంకర్ (Bhola Shankar). మెహ‌ర్‌ర‌మేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోండగా.. కీర్తిసురేశ్‌ చిరంజీవి సోదరి పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆ తర్వాత యువ హీరో వరుణ్‌తేజ్‌ (Varun Tej) నటిస్తున్న ప్రాజెక్ట్‌ గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna). ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని తెలియజేస్తూ.. కొత్త పోస్టర్‌ కూడా విడుదల చేశారు. ఈ మూవీలో మోడల్‌ సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ది ఘోస్ట్‌ ఫేం ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ లాంఛ్‌ చేసిన గాండీవధారి అర్జున ఫస్ట్‌ లుక్‌, మోషన్ పోస్టర్‌ నెట్టింట హల్ చల్ చేస్తోంది.

2023-06-08T13:10:24Z dg43tfdfdgfd