NAGARJUNA | నాగార్జున కొత్త సినిమాకు ముహూర్థం కుదిరినట్లేనా..!

Nagarjuna Next Movie | టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జునకు అర్జెంట్‌గా ఒక హిట్టు కావాలి. గతేడాది భారీ అంచనాల నడుమ రిలీజైన ది ఘోస్ట్‌ తొలిరోజే డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుని వారంలోపే థియేటర్‌లు ఖాళీ చేసింది. కొత్త దర్శకులతో సినిమాలు చేస్తూ, ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ.. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలతో అలరించాలని కోరుకునే నాగ్‌కు వరుస ఫ్లాపులు రావడంతో సగటు ప్రేక్షకులు సైతం నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఫ్యాన్స్‌ మంచి కంబ్యాక్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక అక్కినేని ఫ్యాన్స్ అయితే ఏడాదిన్నరగా ఓ సాలిడ్ హిట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడెప్పుడో వచ్చిన లవ్‌స్టోరీ తర్వాత అక్కినేని ఫ్యామిలీకి ఇప్పటివరకు బంపర్‌ హిట్టే లేదు.

వరుస వైఫల్యాల కారణంగా నాగ్‌ కూడా తన తదుపరి సినిమా కోసం బాగానే కసరత్తులు చేస్తున్నాడు. ఇక నాగ్ తన నెక్స్ట్‌ సినిమాను సినిమా చూపిస్త మామ, నేను లోకల్, ధమాకా వంటి సినిమాలకు రచయితగా పనిచేసిన ప్రసన్న కుమార్‌ బెజవాడ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళంలో సూపర్‌ హిట్టయిన పోరింజు మరియం జోస్‌ ఆధారంగా రూపొందనుంది. తెలుగు నెటివిటీకి తగ్గట్లు ప్రసన్న కుమార్‌ మార్పులు చేర్పులు చేసి స్క్రిప్ట్‌ను పక్కాగా తీర్చిదిద్దాదట. ఇక ఇటీవలే ఫైనల్‌ నెరేషన్‌ విన్న నాగ్.. చాలా ఇంప్రెస్‌ అయ్యాడట.

కాగా ఈ సినిమా షూటింగ్‌ను జూన్‌ మాసం మధ్య నుంచి స్టార్ట్‌ చేయబోతున్నరట. అంతేకాకుండా సినిమా షూట్‌కు వారం రోజుల ముందు పెద్ద ఎత్తున పూజా వేడుకను ప్లాన్‌ చేస్తున్నారట. టాలీవుడ్‌లోని కొందరు ప్రముఖులను ఈ వేడుకకు ఇన్వైట్‌ చేయనున్నట్లు తెలుస్తంది. ఈ సినిమా నాగార్జునకు 99వ మూవీ. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మించనున్నారట.

2023-05-26T11:35:30Z dg43tfdfdgfd