NTR | ఎన్టీఆర్‌ గురించి చరిత్ర భావితరాలకు గర్వంగా చెబుతుంది : చిరంజీవి

Sr.NTR@100 Years |  తెలుగు సినిమా ప్రస్థావన వస్తే మొదటిగా చెప్పుకునే పేరు నందమూరి తారక రామారావు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా తెలుగు ప్రేక్షకుల్లో అన్నగారి స్థానం చిరస్మరణీయం. రాముడు, కృష్ణుడు, భీముడు, కర్ణుడు ఇలా పౌరాణిక పాత్రల్లో ఆయన్ను తప్ప వేరే వారిని ఊహలో కూడా ఊహించలేము. అంతలా ఈ పాత్రల్లో ఒదిగిపోయాడు. సాంఘీకం, జానపదం, ఫాంటసీ, కుటుంబ కథా చిత్రాలు, మల్టీస్టారర్‌లు ఇలా అన్ని జానర్‌లలో తనదైన ముద్ర వేసుకున్నారు సీనియర్‌ ఎన్టీఆర్‌. ఆదివారం ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు.

బాలకృష్ణ:

ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్‌ ఘాట్‌లో ఆయన తనయుడు, నటుడు బాలకృష్ణ తెల్లవారు జామున పూలమాల వేసి నివాళులు అర్పించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన కుమారిడిగా జన్మించడం అదృష్టంగా భావిస్తున్నట్లు బాలకృష్ణ చెప్పాడు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాలు సహా ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నాడు.

చిరంజీవి:

‘నూటికో కోటికో ఒక్కరు… వందేళ్లు కాదు…చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాలకి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు శ్రీ NTR. తెలుగు జాతి ఘనకీర్తి కి వన్నె తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారితో నా అనుబంధం నాకెప్పుడూ చిరస్మరణీయం. రామారావు గారి శతజయంతి సందర్భంగా వారిని స్మరించుకుందాం’ అంటూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరిత పోస్ట్‌ చేశాడు.

రాజేంద్రప్రసాద్:

ఇక తాజాగా రాజేంద్ర ప్రసాద్‌.. ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులు అర్పించాడు. ‘ఎన్టీఆర్ పుట్టిన నేలపై జన్మించడం అదృష్టమని రాజేంద్ర ప్రసాద్‌ కొనియాడాడు. ఎన్టీఆర్ ఉండి ఉంటే ఆయనకు బంగారు పూలతో పాదపూజ చేసే వాడినని, ఎన్టీఆర్ తనకు గురువు, దైవమని, ప్రజలనే దేవుళ్లుగా ఆయన భావించారని వెల్లడించాడు. ఆయనను అలాగే చూశానని, ఎన్టీఆర్‌ వద్ద కుల ప్రస్థావన తీసుకొస్తే చాలా కోప్పడేవారని రాజేంద్ర ప్రసాద్‌ గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారని తెలిసి ఆనందపడ్డానని, ఆయన గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందని’ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నాడు.

2023-05-28T07:36:21Z dg43tfdfdgfd