Rangabali | టాలీవుడ్ యాక్టర్ నాగశౌర్య (Naga Shaurya) నటిస్తున్న తాజా చిత్రం రంగబలి (Rangabali). పవన్ బసంశెట్టి (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం రంగబలి టీజర్‌ను లాంఛ్ చేశారు. కుర్రాళ్లంటే ఈ వయస్సులో ఇలాగే ఉంటార్రా.. నువ్వేం కంగారు పడకు.. అంటూ హీరో క్యారెక్టరైజేషన్‌ను పరిచయం చేసే డైలాగ్స్‌తో షురూ అయింది టీజర్. హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్, ఫన్, సీరియస్ అంశాల నేపథ్యంలో సినిమా ఉండబోతుందని టీజర్‌తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే రంగబలి నుంచి విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ మన ఊరిలో ఎవడ్రా ఆపేది సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం రంగబలి షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రం జులై 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.
సత్య, అనంత్ శ్రీరామ్, గోపరాజు రమణ, కల్యాణి నటరాజన్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, సప్తిగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి, భద్రం, శివనారాయణ, పీకే, పవన్, నోయెల్, రమేశ్ రెడ్డి, హరీష్ చంద్ర, బ్రహ్మాస్త్రి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగశౌర్య దీంతోపాటు నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
రంగబలి టీజర్..
మన ఊరిలో లిరికల్ వీడియో సాంగ్..