Virupaksha Climax Twist| మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌ను వంద కోట్ల క్లబ్‌లో నిలబెట్టిన విరూపాక్ష ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్‌లో ఈ సినిమాకు ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో.. ఓటీటీలోనూ అంతే స్థాయిలో ఆదరణ వస్తుంది. ఐదు వారాల క్రితం భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా అంతే భారీగా ఓపెనింగ్స్ రాబట్టింది. సాయితేజ్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. తొలి రోజే అనుకుంటు రెండో రోజు కూడా అదే రేంజ్‌లో కలెక్షన్లు సాధించింది. ఇక ఫస్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని డిస్ట్రిబ్యూటర్‌లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది. కథలో మ్యాటర్ ఉంటే కలెక్షన్‌లకు అడ్డులేదని మరోసారి ఈ సినిమా రుజువు చేసింది.
ఇక ఈ సినిమాలో ముఖ్యంగా సంయుక్త నటనకు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. క్లైమాక్స్‌లో అయితే సంయుక్త యాక్టింగ్ వేరే లెవల్. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ కూడా అందరనీ షాక్‌కు గురిచేసింది. అప్పటివరకు ఒక ఫ్లోలో వెళ్తున్న సినిమాకు సంయుక్త ట్విస్ట్ అందరిని ఆశ్చర్యంలో పడేసింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు కార్తిక్.. ఈ సినిమా గురించి, అందులో విలన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ముందుగా తాను రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం యాంకర్ శ్యామల పాత్రను విలన్‌గా చూపించాలనుకున్నాడట. ఊర్లో జరిగే అన్ని పరిణామాల వెనకున్నది ఆమెనే అని చెప్పాలనుకున్నాడట.
కాగా ఇదే విషయాన్ని సుకుమార్‌కు చెబితే.. ఆ పాత్ర అంత ఇంపాక్ట్ చూపించదు. క్లైమాక్స్ బ్లాస్ట్ అవ్వాలి. హీరోయిన్‌ను విలన్‌గా పెట్టమని సలహా ఇచ్చాడు. దాంతో ఈ సినిమా స్క్రీన్‌ప్లేను పూర్తిగా మార్చేశామని, కొత్త సీన్లు రాశామని కార్తిక్ చెప్పాడు. ఇక్కడ సుకుమార్ బ్రిలియన్స్ ఏంటో అర్థమయిపోతుంది. ఈ సినిమాలో మేయిన్ హైలెటే క్లైమాక్స్ ట్విస్ట్. అందులోనూ హీరోయిన్‌ను విలన్‌గా పెట్టడం నిజంగా అందరకీ షాక్ ఇచ్చింది. ఇక ఈ సినిమాకు సుకుమార్ సహా నిర్మాతగా ఉండటంతో పాటు స్క్రీన్‌ప్లేను కూడా అందించాడు.
2023-05-26T07:20:29Z dg43tfdfdgfd