ఆ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్.. ఈసారి అంతకుమించి అంటున్న దర్శకుడు

ఆ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్.. ఈసారి అంతకుమించి అంటున్న దర్శకుడు

తమిళ స్టార్ హీరో కార్తీ(Karthi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తన సినిమాలతోనే ఎక్కువగా మాట్లాడతారు. అన్నయ్య సూర్య లాగే కార్తీ కూడా నార్మల్ కమర్షియల్ సినిమాలు చేయడానికి ఇష్టపడరు. సినిమా సినిమాకి ఎదో ఒక వేరియేషన్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇటీవల వచ్చిన జపాన్ సినిమాలో కూడా తన బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా మార్చేశాయి ఆడియన్స్ కు సరికొత్తగా ఎంటర్టైన్మెంట్ పంచడానికి ట్రై చేశారు. కానీ ఈ సినిమా ఆడియన్స్ ను పెద్దగా అలరించలేకపోయింది. కాన్సెప్ట్ బాగానే ఉన్నా.. ప్రెజెంటేషన్ బాలేకపోవడంతో ప్లాప్ గా నిలిచింది ఈ సినిమా. 

ఇదిలా ఉంటే.. తాజాగా కార్తీ నటించిన ఒక సూపర్ హిట్ సినిమా గురించిన క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. కార్తీ కెరీర్ లోనే చాలా స్పెషల్ మూవీ నాటే ఖాకీ అనే చెప్పాలి. దర్శకుడు హెచ్ వినోద్ ఈ సినిమాను బాక్సాఫీస్ దగ్గర అనూహ్య విజయాన్ని సాధించింది. 1995-2006 మధ్య కాలంలో జరిగిన ఆపరేషన్ బవారియా ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు. ఒక వాస్తవ కథకు సినిమాటిక్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ప్రేక్షకులను కట్టిపడేశారు. అందుకే ఈ సినిమాపై విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. 

అయితే తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ వినోద్ ఖాకి సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. తాజాగా ఓకే ఈవెంట్ లో పాల్గొన్న దర్శకుడు వినోద్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. ఖాకి మూవీకి సీక్వెల్ కథ సిద్ధంగా ఉందని.. కార్తీకి కూడా వినిపించానాని ఆయన తెలిపారు. దీంతో కార్తీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి ఈ సీక్వెల్ ఎప్పుడు మొదలుకానుంది? ఎలాంటి రిజల్ట్ అందుకోనుంది? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

©️ VIL Media Pvt Ltd.

2023-11-20T05:36:34Z dg43tfdfdgfd