ఇతనిపై పాములు ఎంతలా పసిగట్టాయంటే..!

G Srinivasulu, News18, Chittoore

పాము కాటుకు గురైతే వారిని గోల్డెన్ అవర్ లో చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. పాము విషం శరీరమంతా పాకేస్తే బ్రతికించడం కష్టం. సాధారణంగా పాముకాటుకు గురైతే సర్పదోషం అందని భాలిస్తారు. చేసిన కర్మకు దోషం ఉంటే.. వాటికి పరిష్కార మార్గాల గురించి అన్వేషిస్తారు. కానీ ఓ వ్యక్తికి సర్పదోషం వెంటాడుతోందట. ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా 40ఏళ్లుగా దోషం వేధిస్తోంది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం పెద్ద చెల్లారగుంట పంచాయతీలో మారుమూల కూగ్రామ మైన కుమ్మరిగుంట గ్రామం ఉన్నది. ఈ గ్రామంలో సుబ్రహ్మణ్యం, శారద అనే దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

సుబ్రహ్మణ్యానికి 10ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి పాములు కరవడం మొదలైంది. అప్పటి నుంచి తరచూ పాములు కరవడం ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడం జరుగుతోంది. ఇప్పుడు సుబ్రహ్మణ్యానికి పెళ్లై, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పాములు అతడ్ని వెంటాడుతూనే ఉన్నాయి. కూలీ చేసి సంపాదించినదంతా ఆస్పత్రికి ఖర్చులకే సరిపోతుంది.

ఇది చదవండి: కలలోకి వచ్చిన దేవుడు.. వీళ్లు నట్టింట్లో ఏం చేశారో చూడండి..!

పాములు అతడ్ని ఎంతలా వెంటాడుతున్నాయంటే పాముకాటుకు చికిత్స కోసం ఏకంగా పొలాన్నే అమ్మేశాడు. ప్రస్తుతం ఉన్నదంతా అయిపోవడంతో పాముకరిస్తే చికిత్సకు డబ్బుల్లేవని సుబ్రహ్మణ్యం కుటుంబం వాపోతోంది. తాము రాష్ట్రం వదిలేసి కర్ణాటక వెళ్లినా పాములు వదలడం లేదని.. వీటి నుంచి విముక్తి కల్పించాలంటూ దేవుడ్ని వేడుకుంటున్నారు. అన్నట్లు సర్పదోషం పోవడానికి సుబ్రహ్మణ్యం కుటుంబం వెళ్లని గుడి లేదు.. చేయని పూజ లేదు. కానీ సర్పదోషం మాత్రం అలాగే ఉండిపోయిందంటున్నారు.

2023-05-27T03:57:28Z dg43tfdfdgfd