ఒక్క కౌగిలింతతో సూపర్ మ్యాజిక్.. ఎన్నో సమస్యలు మటుమాయం!

కష్టమొచ్చినా, బాధ వచ్చినా ఇతరులతో పంచుకుంటే మనసు తేలికపడుతుంది. ఈ షేరింగ్, కేరింగ్ ఫీలింగ్స్‌ను కౌగిలింతతో బయట పెట్టవచ్చు. తీవ్ర భావోద్వేగ సమయాల్లో కొందరు ప్రియమైన వారిని కౌగిలించుకోవడం కామన్. అయితే ఇలా హగ్ చేసుకోవడం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. హగ్గింగ్ ఆక్సిటోసిన్ హార్మోన్‌ విడుదలను ప్రేరేపిస్తుంది. దీన్ని ‘లవ్ హార్మోన్, ‘బాండింగ్ హార్మోన్’ అని కూడా పిలుస్తారు. హగ్ చేసుకోవడం వల్ల వ్యక్తుల్లో సానుకూల ధోరణి అలవడుతుంది. ఏదైనా కష్టం వస్తే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. మీకు బాగా నచ్చినవారు, సన్నిహితంగా మెలిగేవారిని హత్తుకుంటే అధిక ప్రయోజనం ఉంటుంది. ఆప్యాయతతో కూడిన ఆ వెచ్చని ఓదార్పు శారీరకంగా, మానసికంగా ఎంతో మేలు చేస్తుంది. ఈ హగ్గింగ్ థెరపీ బెనిఫిట్స్ తెలుసుకుందాం. * మానసిక స్థితిహగ్గింగ్‌తో శరీరానికి సానుకూల స్పర్శ లభిస్తుంది. ఇది ఎండార్ఫిన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఆనందం, శ్రేయస్సు భావాలను సృష్టిస్తుంది. మొత్తంగా సహజమైన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. * ఆందోళన, డిప్రెషన్ తగ్గుదలకౌగిలించుకోవడం అనేది ఎమోషనల్ సపోర్ట్ అందిస్తుంది. ఆందోళన, నిరాశ వంటి లక్షణాలను తగ్గించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇది కనెక్షన్, సేఫ్టీ ఫీలింగ్‌ను పెంపొందిస్తుంది. * ఎమోషనల్ కనెక్ట్గాఢమైన కౌగిలింత ప్రేమ, దయ, అవగాహన వంటి భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంది. సంబంధాలను నెరపడానికి ఇది ముఖ్యమైన వనరు. ఎందుకంటే బలమైన సామాజిక సంబంధాలు భావోద్వేగ శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి. * ఒత్తిడి దూరంహగ్ అనే స్పర్శ ఆక్సిటోసిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఫలితంగా శరీరంలో కార్టిసాల్ లెవల్స్ నియంత్రణలోకి వచ్చి అంతిమంగా ఒత్తిడిని తగ్గిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి వివిధ ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది. హగ్ ద్వారా ఒత్తిడిని తగ్గించి ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. * నొప్పి ఉపశమనంహగ్ చేసుకోవడం అనే శారీరక స్పర్శ సహజ నొప్పి నివారిణి ఎండార్ఫిన్స్ విడుదలను ప్రేరేపిస్తుంది. దీంతో నొప్పి తగ్గుతుంది. అసౌకర్యంగా ఫీల్ అవ్వడాన్ని తగ్గించుకోవచ్చు. * రోగనిరోధక వ్యవస్థ మెరుగుహగ్గింగ్ వంటి సానుకూల శారీరక చర్యలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఎందుకంటే హగ్‌తో ఒత్తిడి తగ్గుతుంది. ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. * స్ట్రెస్ మేనేజ్‌మెంట్రెగ్యులర్ ఫిజికల్ టచ్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌ టూల్‌గా పనిచేస్తుంది. ఇది శరీరం ఒత్తిడి ప్రతిస్పందనను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సులభంగా ఎదుర్కోవడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. * గుండె ఆరోగ్యంహగ్ చేసుకోవడం.. అధిక రక్తపోటు, హృదయ స్పందన రేటు తగ్గడానికి దారితీస్తుంది. కాలక్రమేణా ఇది గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. (Disclaimer: ఈ వ్యాసంలో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)

2023-11-21T12:12:42Z dg43tfdfdgfd