Venu Medipelly, News18, Mulugu
ఈ కాలంలో గుప్తనిధులు ఉన్నాయంటే మీలో ఎంతమంది నమ్ముతారు..? ప్రభుత్వం గుప్త నిధుల వేటను నిషేధించినప్పటికీ ఎందుకు అన్వేషిస్తూ ఉంటారు..? ఈ కాలంలో కూడా ఇంకా కొంతమంది మంత్రాలు, పూజలు, యాగాలు చేస్తూ మరీ గుప్తనిధుల కోసం నిర్విరామంగా అన్వేషిస్తూ ఉంటారు. అయితే, పోలీసులకు వచ్చే విశ్వసించిన సమాచారం మేరకు పోలీసులకు దొరికితే మాత్రం కఠిన శిక్షలు తప్పవు. ఇలాంటి ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. మరి నిజానికి భూమి పొరలలో గుప్తనిధులు దాగి ఉన్నాయా..? రాజుల కాలంనాటి సొమ్ము భూమిలో పేరుకు పోయిందా అనేది ఆసక్తి కరంగా ఉంటుంది. రాత్రి కలలోకి వచ్చి దేవుడు మీ నట్టింట్లో భూమి పొరల్లో బంగారం దాగి ఉందని చెప్తే మీరు ఏం చేస్తారు..? ఇలాంటి ఘటనలు జరుగుతాయా అనే అనుమానం వస్తే నిజమే అని మనం సమాధానం చెప్పుకోవాలి. ఇలాంటి ఘటనే ఉమ్మడి వరంగల్ (Warangal) భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం బావు సింగ్ పల్లిలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో పోలీసులు ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ పంపారు. ఈ గ్రామానికి చెందిన అజ్మీర సారయ్య ఇంట్లో నుండి వింత శబ్దాలు రావడంతో మట్టిని తవ్వారు. దీంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. ఇంట్లో ఏం జరుగుతుందని స్థానికులు ప్రశ్నించగా వారు అర్థంపర్థం లేని సమాధానాలు చెప్పారు. యవ్వారం ఏదో తేడాగా ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రంగంలోకి దిగిన పోలీసులు..
స్థానికులు సమాచారం ఇవ్వడంతోసంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దంపతుల ఇంటిని పరిశీలించారు. ఇంటి లోపలికి వెళ్ళిన పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. నట్టి ఇంట్లో భారీ గుంతనుచూసి పోలీసులు అవాక్కయ్యారు. 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా గుప్తనిధుల కోసమే భారీ గుంతలు తీశామని నిందితులు ఒప్పుకున్నారు.
కలలో వచ్చిన దేవుడు..
ఏం జరిగింది అని విచారించగా దంపతులు చెబుతున్న దాని ప్రకారం వారు నిద్రపోతున్నప్పుడు దేవుడు కలలో కనిపించి మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని చెప్పారట. వెంటనే అజ్మీర సారయ్య ఈ విషయం వారి బంధువులకు వివరించాడు. వెంటనే వారి బంధువులను ఇంటికి పిలిపించుకొని దేవుడి ఫోటో, దీపం వెలిగించి తవ్వకాలు మొదలు పెట్టారట. తవ్వుతుండగా స్థానికులకు శబ్ధం రావడంతో ఈ ఘటన బయటకు వచ్చింది.
2023-05-27T03:42:28Z dg43tfdfdgfd