కాణిపాకంలో అన్యమత దేవతల ఫోటో ప్రత్యక్షం.. ఇదేం తీరు అంటూ భక్తుల ఆగ్రహం!

శ్రీ విఘ్నేశ్వరుడు స్వయం వ్యక్తమై వెలసిన దివ్య పుణ్యక్షేత్రం కాణిపాకం. సత్యప్రమాణాలకు ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతోంది. నిత్యం గణపయ్య దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. గణపతి ఆలయంతో పాటుగా…. పరమేశ్వరుని ఆలయం., శ్రీ వరద రాజ స్వామి ఆలయం ఉంది. ఆలయ మహా ప్రకారం లోపే ఈ ఉప ఆలయాలు ఉన్నాయి శ్రీ వరదరాజుల స్వామి ఆలయం వద్ద అన్య మతానికి సంబంధించిన చిత్రపటాలను గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి విడిచి వెళ్లారు. వరదరాజ స్వామి ఆలయం దీప స్థంభం వద్ద అన్యమతస్తుల ఫోటోను గుర్తించిన భక్తులు భక్తులు ఆలయ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే విషయం తెలుసుకున్న అధికారులు ఆ చిత్రపటాన్ని తొలగించారు. కొందరు దీపస్తంభం వద్ద ఫోటోను చూసి కొందరు స్థానికులు తమ ఫోనులో చిత్రీకరించారు. సామాజిక మాధ్యమాలలో విషయం వైరల్ కావడంతో….. హిందూ సంఘాలు ఈ ఘటనను తప్పుబడుతున్నాయి. అన్యమతస్తులు హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై అన్యమతస్తుల ఆగడాలు ఎక్కువవుతున్నాయి వీటన్నిటిని చూస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందని ఆరోపిస్తున్నారు. దీనిపై ఆలయ అధికారాలు ఇప్పటికే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలిచ్చామని ఆలయఈవో వెంకటేశు తెలిపారు.

2023-11-20T07:40:52Z dg43tfdfdgfd