గిరిజన ప్రజల నమ్మకం, ఆరాధ్య దైవం మొదకొండమ్మ అమ్మవారు. ఏజెన్సీలో గిరిజనులు ఈ పనులు మొదలు పెట్టినా, ఎక్కడికి వెళ్ళినా మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. ఉమ్మడి విశాఖపట్నం , అల్లూరి సీతారామరాజు జిల్లా ముఖ్య కేంద్రం పాడేరులో మోదకొండమ్మ అమ్మవారు కొలువుదీరారు.ముఖ్యంగా గిరిజనులు అమ్మవారి స్మరించుకొని తమ వృత్తులను ప్రారంభిస్తారు. పర్యాటక ప్రాంతాలు ఎక్కువగా వుండటంతో వచ్చే పర్యాటకులు అందరూ అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు. ఘాట్ రోడ్ మొదలుకొని మన్యంలో గిరిజన ప్రాంతాలు అన్ని చోట్ల కూడా అమ్మవారు కొలువై ఉంటారు. ఘాట్ రోడ్ ఎక్కి వెళ్లేటప్పుడు , దిగేటప్పుడు కూడా అమ్మవారి ఆలయం వద్ద ఆగి దర్శించుకుని అప్పుడు ప్రయాణం మొదలుపెడతారు.40 పైసలకే రూ.లక్ష నుంచి 2 లక్షల వరకు రుణాలు.. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..కార్తీక మాసంలో ఎక్కువగా మన్యంలో మంచు వుంటుంది. అది చూసేందుకు ఎక్కువగా పర్యాటకులు వస్తూ వుంటారు. అయితే పర్యాటకలు అందరూ కూడా మొదటగా అమ్మవారిని దర్శించుకునే మన్యంలో అన్ని ప్రాంతాలను చూసి వెళ్తారు. దశలో వైశాఖ మాసంలో ఏటా జరిగే మూడు రోజుల ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అదే సమయంలో భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకొని శుభకార్యాలు చేపడతారు భక్తులు. ఈ అమ్మవారికి పాడేరులో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.పాడేరు పట్టణం పరిసరాల్లో భారీ సెట్టింగులు విద్యుత్ దీపాల అలంకరణతో ఏర్పాట్లు కూడా చేస్తారు. కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజనులు మాత్రమే కాక ఈ ప్రాంతంలో ఉద్యోగాలు కోసం వచ్చిన ఎందరో తిరిగి అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివస్తారు. అడవిపై ఆధారపడే గిరిజనులకు జంతువుల నుంచి రక్షణ సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండటానికి అమ్మవారి చల్లని ఆశీస్సులు ఉంటాయని భక్తులు పేర్కొంటున్నారు.వారు చేసే పూజలు వారికి అంతా అమ్మవారి రక్షణ అని గిరిజనులు అంటున్నారు. చారిత్రాత్మకంగా వనదేవతల ఆత్మార్పణం ద్వారా ఏడుగురు అక్కచెల్లెల్ల పెద్ద అక్క మోదకొండమ్మ అమ్మవారు పాడేరులో కొలువుదీరినట్టు గిరిజన ప్రజల విశ్వాసం అమ్మవారి మిగిలిన చెల్లెలు వేర్వేరు ప్రాంతాల్లో వనదేవతలగా భక్తుల పూజలు అందుకుంటారు.
2023-11-21T11:57:39Z dg43tfdfdgfd