క్లూస్‌‌ టీమ్‌‌ మెచ్చిన అథర్వ

క్లూస్‌‌ టీమ్‌‌ మెచ్చిన అథర్వ

క్రిమినల్స్‌‌ను పట్టుకునేందుకు క్లూస్, ఫోరెన్సిక్ డిపార్ట్‌‌మెంట్స్‌‌ ఎలా పనిచేస్తాయని చూపించే చిత్రం  ‘అథర్వ’. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా లీడ్‌‌ రోల్స్‌‌లో మహేష్ రెడ్డి దర్శకత్వంలో సుభాష్ నూతలపాటి నిర్మించారు. డిసెంబర్ 1న సినిమా విడుదల. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖలోని క్లూస్, ఫోరెన్సిక్ విభాగంకు స్పెషల్ షో వేశారు. 

అనంతరం స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ అడిషనల్ డైరెక్టర్ డా.అనిత ఎవాంజెలిన్ మాట్లాడుతూ ‘పోలీస్ శాఖలో క్లూస్‌‌ టీమ్ ఎంత ప్రముఖమైనదో చూపించారు. మా అందరికీ ఓ నివాళిలా అనిపించింది. సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు. 

‘క్రైమ్ సీన్ ఆఫీసర్ అంటే అథర్వలో కార్తీక్ రాజులా ఉండాలనేలా చూపించారు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది’ అని హైద్రాబాద్ సిటీ పోలీస్, క్లూస్ జాయింట్ డైరెక్టర్ డా.వెంకన్న అన్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2023-11-21T04:38:26Z dg43tfdfdgfd