గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఎక్కడ.. కనిపించడం మానేశారంటున్న అంటున్న ప్రజలు..!

ప్రముఖ పారిశ్రామిక వేత్తగా, సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్న గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి.. రెండు సార్లు ఎంపీగా విజయ కేతనం ఎగరవేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన జయదేవ్.. గుంటూరు అల్లుడిని అని చెప్పి అక్కడి నుండి పోటీ చేసి రెండు సార్లు విజయం సాధించారు.

మొదటి సారి అధికార టీడీపీ నుంచి పోటీచేసి గెలిచి నప్పటికీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి పెద్దగా చేసిందేం లేదనే విమర్శలు వచ్చాయి. ఇక రెండో సారి గెలిచాక మాత్రం పూర్తిగా కనిపించడమే మానేశాడు అంటున్నారు స్థానిక ఓటర్లు. 2019 లో జయదేవ్ టీడీపీ తరఫున గెలిచినప్పటికీ వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి రావడంతో గల్లా పై ఒత్తిడి పెరిగింది.

ఇదీ చదవండి:  రేపు రూ. 224.31 కోట్లతో ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు..!

జయదేవ్ వ్యాపారాల లో ప్రముఖమైన అమరరాజ బ్యాటరీస్ పై కేసులు నమోదు అయ్యాయి. సంస్థ విస్థరణ పనులకు ఆటంకాలు కలిగించడంతో.. ఎందుకొచ్చిన గొడవ అని అనుకున్నారో ఏమో కానీ.. రాజకీయంగా మౌనం వహిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని చెప్పిన ఎంపీ అసలు ఆవైపు తొంగిచూడటం లేదంట. దత్తత గ్రామాల సంగతి దేవుడెరుగు, అసలు నియోజకవర్గంలోనే ఎక్కడా కనపడటం లేదని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు.

రాజకీయాల కంటే వ్యాపారాలే ముఖ్యం అనుకుంటే.. పదవికి రాజీనామా చేసి సొంత పనులు చూసుకోవచ్చు కదా అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. కేంద్రం నుండి నియోజకవర్గానికి రావలసిన నిధులు, పలు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయని వాటిగురించి పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడంటున్నారు ఓటర్లు. దీంతో వచ్చే ఎన్నికలలో స్థానికంగా అందరికీ అందుబాటులో ఉండే నాయకుడికే టికెట్ ఇవ్వాలని నియోజకవర్గంలోని స్థానిక పార్టీ క్యాడర్ అధిష్టానానికి సూచిస్తున్నారట. ఐతే రెండుసార్లు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కనిపించకుండా తిరుగుతున్న గల్లా జయదేవ్ ఏం సమాధానం చెబుతారో చూడాలి.

2023-09-18T16:08:09Z dg43tfdfdgfd