గూఢచారికి జోడీగా బనితా సంధు

గూఢచారికి జోడీగా బనితా సంధు

అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘జీ 2’. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడు. 2018లో వచ్చిన ‘గూఢచారి’ చిత్రానికి ఇది సీక్వెల్. ఇప్పటికే ఫస్ట్ లుక్‌‌ పోస్టర్‌‌‌‌తో ఇంప్రెస్ చేసిన టీమ్.. సోమవారం హీరోయిన్‌‌ పేరును రివీల్ చేశారు. శేష్‌‌కు జంటగా బనితా సంధు నటిస్తోందని తెలియజేశారు. 

అక్టోబర్, సర్దార్‌‌ ఉదమ్‌‌ వంటి హిందీ చిత్రాలతో పాటు తమిళంలో ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘ఆదిత్య వర్మన్‌‌’లో హీరోయిన్‌‌గా నటించింది బనితా. ‘జీ2’లో నటించడంపై ఆమె మాట్లాడుతూ ‘ఇదే నా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఇలాంటి విజనరీ టీమ్‌‌తో కలిసి వర్క్ చేయడం హ్యాపీ. 

గతంలో నేనెప్పుడూ కనిపించని డిఫరెంట్ క్యారెక్టర్‌‌‌‌ను ఇందులో పోషిస్తున్నా. ప్రేక్షకులు నన్ను ఓ సరికొత్త అవతార్‌‌‌‌లో చూడబోతున్నారు’ అని చెప్పింది.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్స్‌‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.

2023-11-21T01:53:04Z dg43tfdfdgfd