జబర్దస్త్ షోలో గుండు గీయించుకున్న కమెడియన్‌.. ఇలా అయితే జడ్జ్ లుగా ఉండమంటూ ఖుష్బు వెళ్లడంతో అంతా షాక్‌

జబర్దస్త్ కామెడీ షోలో ఆ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. జబర్దస్త్ కామెడీ గుండు గీయించుకోవడం పెద్ద షాకిస్తే, జడ్జ్ లుగా ఉన్న ఖుష్బు, కృష్ణభగవాన్ షో నుంచి వెళ్లిపోవడం మరో పెద్ద షాక్‌గా మారింది. 

 

జబర్దస్త్ కామెడీ షోలో స్కిట్ల కోసం పలు డ్యూయెట్లు, తిట్టుకోవడాలు, ఒకరిపై ఒకరు ఫైర్‌ కావడం సహజంగా జరుగుతుంది. కంటెంట్‌ కోసం ఇదంతా చేస్తుంటారు. కానీ ఎప్పుడూ లేని విధంగా ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. జబర్దస్త్ షోలో కమెడియన్‌ బుల్లెట్‌ భాస్కర్‌ గుండు గీయించుకోవడం పెద్ద షాకింగ్‌గా మారింది. దీనికి జడ్జ్ ల రియాక్షన్‌, వాళ్లు షోనుంచి వెళ్లిపోవడంతో అంతా ఖంగుతిన్నారు. ఒక్కసారిగా షో మొత్తం ఆయోమయంగా మారింది. 

 

ఇంతకి ఏం జరిగిందంటే.. `ఎక్స్ ట్రా జబర్దస్త్` కామెడీ షోలో కమెడియన్లు తమ స్కిట్లని ప్రదర్శిస్తుంటారు. అయితే  స్కిట్‌లోనే హైలైట్‌ డైలాగులు, పంచ్‌లను ఫోకస్‌ చేస్తుంటారు. అందులో భాగంగా బుల్లెట్‌ భాస్కర్‌ తన టీమ్‌తో కలిసి `నిజం` సినిమా స్కిట్‌ని ప్రదర్శించారు. ఇందులో గోపీచంద్‌ గా బుల్లెట్‌ భాస్కర్‌, మహేష్‌గా నరేష్‌, మదర్‌ రోల్‌లో ఫైమా చేశారు. 

నరేష్‌.. మహేష్‌ పాత్రలో.. ఇది చేయి, ఇది పిడికిలి.. అని మహేష్‌ స్టయిల్‌లో చెప్పగా, మొత్తం కలిసి నా వేలంతా లేదు కదరా అని భాస్కర్‌ చెప్పడంతో నవ్వులు పూయించాయి. ఇక గోపీచంద్‌ పాత్రలో బుల్లెట్‌ భాస్కర్‌ చెబుతూ.. పెద్దమ్మ తల్లికి అమ్మోరు తల్లిని బలియండ్రా అని చెప్పాడు. దీనికి జడ్జ్ కృష్ణభగవాన్‌ అభ్యంతరం తెలిపారు. 

 

సినిమాలో గోపీచంద్‌ పెద్దమ్మ తల్లి వద్దకు వెళ్లినప్పుడు ఆయనకు గుండు ఉంటుంది కదా, అని ప్రశ్నించాడు, దీనికి భాస్కర్‌ రియాక్ట్ అవుతూ, ఫస్ట్ నుంచి పెట్టుకోవాలి సర్‌, మధ్యలో అంటే కష్టమవుతుందన్నాడు. దీనికి ఖుష్బూ రియాక్ట్ అయ్యింది. స్ఫూప్‌ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా ఉండాలి కదా అని, ఫీల్‌ అవ్వడానికి ఏం లేదు కదా అని ఆమె ప్రశ్నించింది. దీంతో భాస్కర్ కి దిమ్మతిరిగిపోయింది. 

 

దీనికి రియాక్ట్ అయిన భాస్కర్‌.. తాను స్కిట్‌ కోసం ప్రాణమిస్తా, అలాంటిది జుట్టు పెద్ద సమస్య కాదన్నాడు. అంతేకాదు మీరు గుండు అన్నారు కాబట్టి 100శాతం గుండులోనే చూపిస్తా అంటూ జబర్దస్త్ షోలోనే ఆయన గుండు గీయించుకోవడం అందరికి షాకిచ్చింది. షో స్టేజ్‌ మీదే, స్కిట్‌లోనే ఆయన తన గుండు గీయించుకున్నాడు. `నిజం`లో గోపీచంద్‌లా మారిపోయాడు.  దీంతో అటు కృష్ణభగవాన్, ఖుష్బూ, ఇటు యాంకర్ రష్మి, ఇతర కమెడియన్లంతా షాక్‌లోకి వెళ్లిపోయారు. 

 

ఖుష్బూకి ఏం రియాక్ట్ కావాలో కూడా తెలియలేదు. అలాంటి పరిస్తితుల్లో భాస్కర్‌ గుండులో చూపించి స్కిట్‌ చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఓకేనా సర్‌ అంటూ భాస్కర్‌ అడిగాడు, దీనికి కృష్ణభగవాన్‌ రియాక్ట్ అవుతూ, ఆ ఎఫెక్ట్ కావాలన్నాం గానీ, నిజంగానే గుండు గీయించుకుంటే ఎలా అన్నాడు. అది మీరు గుండు గీయించుకోవడానికి ముందు చెప్పాలి. అంతా అయిపోయాక పోయిన బొచ్చు వెనక్కి వస్తుందా అని ఘాటుగా రియాక్ట్ అయ్యాడు భాస్కర్‌.

 

దీనిపై జడ్జ్ ఖుష్బూ ఫైర్‌ అయ్యింది. మనకు ఒక రెస్పాన్సిబులిటీ ఇచ్చారు, అందుకే ఈ సీట్‌ మీద ఉన్నాం. అలా ఉన్నప్పుడు ఒక కామెంట్‌ కూడా ఇవ్వడానికి ఫ్రీడమ్‌ లేదంటే అని ఆమె చెప్పబోతుండగా, భాస్కర్‌ కల్పించుకోబోయాడు. దీనికి ఖుష్బూ మరింత స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యింది. నేను నీతో మాట్లాడటం లేదని కౌంటర్‌ ఇచ్చింది. ఒక జడ్జ్ గా ఒక ప్రశ్న అడగడానికి నాకు రైట్స్ లేదంటే  మరి నేను ఎందుకు ఉండాలి ఇక్కడ అంటూ ఖుష్బూ, కృష్ణభగవాన్‌ తమ సీట్ల నుంచి లేచి వెళ్లిపోయారు. దీనికి భాస్కర్‌ కూడా థ్యాంక్యూ మేడం అంటూ స్టేజ్‌ నుంచి వెళ్లిపోవడంతో షో మొత్తం హీటెక్కిపోయింది.

 

తాజాగా విడుదలైన `ఎక్స్ ట్రా జబర్దస్త్` షోకి సంబంధించిన ప్రోమోలోని సన్నివేశం ఇది. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ చూడ్డానికి ఇది రియాలిటీలాగే ఉంది. అయితే ఇలాంటివి కంటెంట్‌ కోసం చాలా సార్లు చేస్తుంటారు. ఇది కూడా అందులో భాగమే అంటున్నారు ఆడియెన్స్. ఇలాంటివి చాలా చూశాం కనీవ్వండి అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. నిజనిజాలు తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే. `ఎక్స్ ట్రాజబర్దస్త్` శుక్రవారం రాత్రి ఈటీవీలో ప్రసారం కానున్న విషయం తెలిసిందే.

2023-11-19T15:09:02Z dg43tfdfdgfd