టాలీవుడ్ ఫస్ట్ ఇంటరాగేటివ్ ఫిల్మ్
స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ది ట్రయల్’. రామ్ గన్ని దర్శకత్వంలో స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించారు. నవంబర్ 24న సినిమా విడుదల అవుతున్న సందర్భంగా దర్శకుడు రామ్ గన్ని మాట్లాడుతూ ‘డిప్యూటీ జైలర్‌గా నా పదేళ్ల కెరీర్‌లో ఎన్నో క్రైమ్ ఇన్సిడెంట్స్ గురించి, ఆ క్రైమ్స్ చేసి ఖైదీలుగా ఉన్న వారి కథలను విన్నాను.
వాటి స్ఫూర్తితో ఈ స్టోరీ రాశాను. ఈ సినిమాను టాలీవుడ్ ఫస్ట్ ఇంటరాగేటివ్ ఫిల్మ్ అంటున్నాం. ఎందుకంటే ఇంటరాగేషన్ రూమ్ నుంచి కథ మొదలై.. అదే గదిలో ముగుస్తుంది. ఇందులో మెసేజ్ కూడా ఉంది. సినిమా నిడివి 1 గంట 39 నిమిషాలు మాత్రమే. దాంతో స్క్రీన్‌ప్లే పరుగులు పెట్టినట్లే క్రిస్ప్‌గా ఉంటుంది. ఎస్ఐ రూప క్యారెక్టర్‌లో స్పందన పల్లి కనిపిస్తుంది. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ బాగా సపోర్ట్ చేశారు. ప్రస్తుతం వర్గో పిక్చర్స్, జీ 5 వాళ్ల ప్రాజెక్ట్ చేస్తున్నా’ అని చెప్పాడు.
©️ VIL Media Pvt Ltd. 2023-11-21T02:23:07Z dg43tfdfdgfd