డిసెంబర్ 1న ఉపేంద్రగాడు వస్తున్నాడు

డిసెంబర్ 1న ఉపేంద్రగాడు వస్తున్నాడు

కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో కంచర్ల అచ్యుతరావు నిర్మించిన చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’.  ఈ  చిత్రాన్ని డిసెంబర్ 1న ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  ఈసందర్భంగా  నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేశారు.  

తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్ అతిథిగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. ఒక కొత్త హీరో ప్రేక్షకులకు దగ్గరయ్యే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని చెప్పాడు ఉపేంద్ర.  తన  కెరీర్‌‌‌‌కు ఈ సినిమా హెల్ప్ అవుతుందని చెప్పింది సావిత్రి కృష్ణ.  ఇదొక యూత్‌‌ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్‌‌ మూవీ అని దర్శకనిర్మాతలు తెలియజేశారు.

©️ VIL Media Pvt Ltd.

2023-11-21T04:38:26Z dg43tfdfdgfd