దేవర షూటింగ్లో శ్రీకాంత్కు ప్రమాదం.. నాగార్జున ముందు క్లారిటీ ఇచ్చేశాడు

దేవర షూటింగ్లో శ్రీకాంత్కు ప్రమాదం.. నాగార్జున ముందు క్లారిటీ ఇచ్చేశాడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో వస్తున్న ఈ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా మంది స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. అందులో శ్రీకాంత్ ఒకరు. ఆయన ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనున్నారు. 

తాజాగా ఓక టీవీ షోలో పాల్గొన్న ఆయన దేవర సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం గురించి చెప్పుకొచ్చారు. అదేంటంటే.. ఈ షోలో శ్రీకాంత్ కాలుకి పట్టీతో కనిపించారు. అధిగమనించిన హోస్ట్ ఎం జరిగింది అని అడిగారు. దానికి సమాధానంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా ఇసుక దిబ్బలపై పరిగెడుతుంటే.. కాలు బెణికింది. చిన్న గాయమే కదా అని పట్టించుకోలేదు. తరువాత రోజుకి వాపు ఎక్కువ అయ్యింది. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్తే.. రెస్ట్ తీసుకోమని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక శ్రీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన కోటబొమ్మాళీ పీఎస్ అనే సినిమాలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను దర్శకుడు తేజ మర్ని తెరకెక్కిస్తుండగా.. నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుండి ఈ సినిమా. అలాగే రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా ఓ కీ రోల్ చేస్తున్నారు శ్రీకాంత్. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. 

©️ VIL Media Pvt Ltd.

2023-11-20T06:36:40Z dg43tfdfdgfd