నటుడు ఆశిష్‌ విద్యార్ది రెండో పెళ్లిపై ..మొదటి భార్య రియాక్షన్ ఏమిటంటే..

ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక భాషల్లో నటుడిగా, ప్రతినాయకుడిగా మెప్పించిన యాక్టర్ ఆశిష్ (Ashish vidyarthi)విద్యార్థి రెండో పెళ్లి వ్యవహారం అేందర్ని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఉత్తర, దక్షిణాదితో పాటు సుమారు 11భాషల్లో 300 సినిమాల్లో నటించి జాతీయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నా అశిష్‌ విద్యార్ధి. ఈనెల 25వ తేది గురువారం అసోంకు చెందిన రూపాలి బారువాను (Roopali Barua)60ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే అంశంపై ఆశిష్‌ విద్యార్ధి మొదటి భార్య రాజ్‌షీ బారువా(Rajoshi) సోషల్ మీడియా (Instagram)వేదికగా పరోక్షంగా స్పందించారు. తన అల్లుడి పుట్టిన రోజు సందర్భంగా అతడికి విషెస్ చెబుతున్నట్లుగా నవ్వుతూ ఉన్న ఫోటోతో పాటు కొన్ని వీడియోలను షేర్ చేసింది రాజ్‌ షీ బారువా. మనసులోని బాధను, ఆవేదనను దిగమింగుకుంటూ భర్త చేసిన పనికి పరోక్షంగా పోస్ట్ పెట్టడం ఇప్పుడు వైరల్ అవుతోంది.

అశిష్ రెండో పెళ్లిపై రియాక్షన్..

నటుడు ఆశిష్‌ విద్యార్ధి 60ఏళ్ల వయసులో అసోంకు చెందిన మోడల్ రూపాలి బారువా

ను రెండో పెళ్లి చేసుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఆయన రెండో వివాహంపై అందరితో పాటు అశిష్‌ విద్యార్ధి మొదటి భార్య స్పందించారు. భర్త రెండో పెళ్లి చేసుకున్న 17గంటల తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు పెట్టారు. అశిష్‌ విద్యార్ధికి మొదటి వివాహం నటి శకుంతల బారువా కుమార్తె, సింగర్‌ రాజ్‌ షీ బారువాతో జరిగింది. వీరిద్దరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు అర్థ విద్యార్థి, కూతురు,అల్లుడు ఉన్నారు. అయితే ఈనెల 25వ తేది జమైషష్టి సందంర్భంగా బెంగాలీ సంప్రదాయం ప్రకారం అల్లుడిని ఇంటికి పిలిచి ఇష్టమైన వంటకాలతో భోజనం పెడతారు. అందులో భాగంగానే అశిష్‌ విద్యార్ధి మొదటి భార్య రాజోషి బారువా అల్లుడి పేరును అడ్డుపెట్టుకొని భర్త చేసిన పనిపై చింతిస్తూ ఓ నిగూఢార్ధం వచ్చేలా పోస్ట్ పెట్టింది.

విద్యార్ధి మొదటి భార్య స్పందన..

మీరు చాలా మంచి వారు. మీరు ఏం చేసినా నేను మిమ్మల్ని ప్రశ్నించను. మీరు బాధ కలిగించే పని చేయరు. అది మాత్రం గుర్తుంచుకోండి. అని ఒక పోస్ట్ పెట్టిన రాజ్‌జీ బారువా కొద్దిసేపటికే... మీ మనసులో చింతలు, సమస్యలు, సందేహాలు తొలగించండి. వీటన్నింటి తర్వాత మీకు ప్రతిదీ స్పష్టంగా అర్దమవుతుంది. అప్పుడు మీ జీవితంలో శాంతి మిగులుతుంది. చాలా కాలంగా మీరు సమస్యలతో పోరాడుతున్నారు. మీకు అంతా మంచి జరగాలి..కాని 'జీవితపు చిక్కుల్లో చిక్కుకోవద్దు' అంటూ నవ్వుతున్న ఫోటోని పిలు విద్యార్ది పేరుతో ఉన్న ఇన్‌స్టా హ్యండిల్‌లో కామెంట్ పోస్ట్ చేసింది అశిష్‌ విద్యర్ధి మొదటి భార్య రాజ్‌షీ బారువా.

Ashish Vidyarthi Marriage: కొత్త పెళ్లికొడుకుగా మారిన పోకిరి విలన్ ..60 ఏళ్ల వయసులో ఏం టేస్ట్..

నిగూడార్దం వచ్చేలా మెసేజ్..

60సంవత్సరాల వృద్ద నటుడు ..సంపూర్ణమైన కుటుంబ జీవితాన్ని కాదు అనుకొని మరో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించడం ఇప్పుడు అందరూ విమర్శిస్తున్నారు. 1986లో నటుడిగా పరిచయమైన అశిష్‌ విద్యార్ధి 300 సినిమాలకుపైగా నటించారు. అంతే కాదు సోషల్ మీడియాలో ఫుడ్ బ్లాగింగ్ కూడా చేస్తున్నారు. అయితే అశిష్‌ మొదటి భార్య రాజ్‌షీ బారువా, రెండో వివాహం చేసుకున్న రూపాలి బారువా ఇద్దరూ అసోంకి చెందిన వాళ్లే కావడం విశేషం. తన భర్తతో గతంలో దిగిన వీడియోలను కూడా రాజ్‌షీ ఇంకా ఇన్‌స్టా నుంచి తొలగించకపోవడం విశేషం.

2023-05-26T08:42:09Z dg43tfdfdgfd