నాగచైతన్య రెండో పెళ్లిపై నిజం ఏంటీ.. తెర వెనక ఏం జరుగుతోంది?

నాగచైతన్య రెండో పెళ్లిపై నిజం ఏంటీ.. తెర వెనక ఏం జరుగుతోంది?

అక్కినేని వారసుడు నాగ చైతన్య(Naga chaitanya) రెండో పెళ్లి వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. గత వారం రోజులుగా చైతన్య రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. అదేంటంటే.. నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యారని, సినీ ఇండస్ట్రీకి సంబంధం లేని ఒక అమ్మాయితో చైతన్య పెళ్లి జరగనుందని, త్వరలోనే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రానుందనేది ఆ వార్తల సారాంశం. 

అయితే తాజాగా నాగ చైతన్య సన్నిహితుల నుండి వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసిందే.అంతేకాదు వారు మరో విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు. అదేంటంటే..  ప్రస్తుతం నాగ చైతన్య నటి శోభిత దూళిపాళ్లతో రేలషన్లో ఉన్నారట. 

ఇప్పుడిపుడే ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారట. అయితే.. ఈ జంట తమ రిలేషన్ ను ఇప్పుడప్పుడే నెక్స్ట్ లెవల్ కు తీసుకెల్లాలని అనుకోడం లేదట. ఆ విషయంలో క్లారిటీ రావడానికి చాలా సమయం పడుతుందని సన్నిహితుల నుండి వినిపిస్తున్న మాట. 

ALSO READ: మేడ్ ఇన్ ఇండియా.. కొత్త సినిమా ప్రకటించిన రాజమౌళి

ఇక ఇదే విషయంఫై ప్రముఖ పత్రికలో వార్తలు కూడా వెలువడ్డాయి. నాగ చైతన్య వ్యాపార వేత్త కూతురుని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం ఈ హీరో నటి శోభిత దూళిపాళ్లతో రేలషన్లో ఉన్నాడు. అంటూ రాసుకొచ్చింది. మరి ఈ వార్తల్లో నిజమెంత తెలియాలంటే ఈ రెండు కుటుంబాల నుండి అధికార ప్రకటన రావాల్సిందే.

©️ VIL Media Pvt Ltd.

2023-09-19T07:57:42Z dg43tfdfdgfd