నిబంధనలకు విరుద్దంగా తిరుమల ఆలయంలోకి కొడాలి నాని... వీడియో వైరల్

తిరుమల : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. సోమవారమే తిరుమలకు చేరకున్న సీఎం ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ క్రమంలో సీఎంతో పాటు స్వామివారి దర్శనానికి వెళ్లిన మాజీ మంత్రి కొడాలి నాని తీరు వివాదానికి దారితీసింది. 

నిబంధనలకు విరుద్దంగా కొడాలి నాని శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్ కంటే ముందుగానే మహాద్వారం గుండా ఎమ్మెల్యే నాని వెళ్లడం వివాదాస్పదంగా మారింది. సీఎం కంటే ముందే తిరుమల ఆలయంలోకి వెళుతున్న నాని వీడియోలు బయటకు వచ్చాయి.

ఇదిలావుంటే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సీఎం జగన్ నిన్ననే తిరుమలకు చేరుకున్నారు. సీఎం జగన్ తో పాటు టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా తదితరులకు మహాద్వారం వద్ద  ఆలయ ప్రధాన అర్చకులు  ఘనంగా స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్ ను వేద పండితులు ఆశీర్వదించి  తీర్థ ప్రసాదాలు అందించారు.

Read More  తిరుమలలో జగన్ టూర్: వెంకన్నకు ప్రత్యేక పూజలు

బ్రహ్మోత్సవాల కోసం తిరుమలకు విచ్చేసిన సీఎం జగన్ వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల కోసం దాతల సహకారంలో నిర్మించిన రెండు విశ్రాంతి గృహాలకు సీఎం ప్రారంభించారు. ఈ రెండు విశ్రాంతి గృహాల్లో క‌లిపి 24 గ‌దులు భ‌క్తుల‌కు అందుబాటులోకి రానున్నాయి.

2023-09-19T09:10:33Z dg43tfdfdgfd