నెక్స్ట్ ఇయర్ నుండి అన్నీ బంద్.. మహేష్ బాబు షాకింగ్ డెసిషన్

నెక్స్ట్ ఇయర్ నుండి అన్నీ బంద్.. మహేష్ బాబు షాకింగ్ డెసిషన్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో ఫ్యామిలీతో ఎక్కువగా వెకేషన్స్ కు వెళ్లే హీరో అంటే టక్కున గుర్తొచ్చే పేరు మహేష్ బాబు(Mahesh babu). ఒక ఇయర్ లో కనీసం రెండు, మూడు సార్లైనా అయన వెకేషన్స్ కు వెళుతుంటారు. ఇదిలా ఉంటే.. తన నెక్స్ట్ సినిమా కోసం షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట మహేష్. 

అదేంటంటే.. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ తో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. దాదాపు షూటిగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత మహేష్ బాబు టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అనౌన్సమెంట్ నుండే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకుకే తగ్గట్టుగానే.. వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్ తో నెక్స్ట్ లెవల్లో తెరకెక్కనుంది ఈ సినిమా.

అయితే ఈ సినిమా కోసం మహేష్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట. రాజమౌళితో సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు ఎలాంటి వెకేషన్స్ అండ్ హాలీడేస్ తీసుకోకుండా పూర్తి సమయాన్ని ఆ సినిమా కోసమే కేటాయించనున్నారట. 2024 లో ఈ సినిమా మొదలుకానుంది. అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ టైం కూడా చాలానే పడుతుందట. ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయిందంటే షూటింగ్ పూర్తి అయ్యే వరకు ఎలాంటి గ్యాప్ లేకుండా వర్క్ చేయనున్నారట. అందుకే వచ్చే సంవత్సరం నుండి వెకేషన్స్ అన్నీ బంద్ చేయనున్నారట మహేష్. 

©️ VIL Media Pvt Ltd.

2023-11-19T07:05:00Z dg43tfdfdgfd